దీపావళి దీపావళి

దీపావళి దీపావళి ,
దివ్య తేజోవళి ,
దివి భువి వెలుగులనింపు
దివ్వెల ఆరావళి ॥దీపావలి॥
దుష్ట దైత్య నరకాసుర
దమనం,
సత్యాదేవి రణకౌశలం ,
శ్రీ కృష్ణ సత్యభామావిజయకేతనం,
సుర, నర,గాంధర్వ ,
సర్వలోకాహ్లాదం . ॥ దీపావలి॥
అమావాశ్య నిశి
అతులిత కాంతుల విరజిమ్ము
శోభాయమాన జ్యోత్స్నావళి ,
పిన్న,పెద్దలు, వృద్ధులు ఎల్లరు ,
ఆనందోత్శాహాల ఓలలాడు ,
దివ్వెల ఆరావళి ॥దీపావలి ॥

జుయ్యిమనినింగికెగిసి
నిప్పులు కురిపించి ,
నీలాలనింగిని వివిధ వర్ణాల మెరిసి
మురిపించు తారాజువ్వలు,
చిచ్చు బుడ్లు,
వెలుగుపూలు .
వెలుగు ముద్దలు కురిపించు
మతాబులు,కాకరపూ వొత్తులు ,
చిన్నారి ఛిటపటలుతో
సరదా సందడుల నింపు దీపావళి ,
నింపాలి నింపాలి మరిన్ని వెలుగులు

మోడీభారతావని పాలనలో ,
చంద్రబాబు ఆంధ్రావని పాలన,రక్ష్ణలతొ
భవిత సాగాలి శాంతి,సౌఖ్య ,
సౌభాగ్య ,సౌభ్రాత్వుత్వాల
తేలి ప్రగతి పదాన సాగాలి

కామేశ్వరి సాంబమూర్తి .భమిడి పాటి