నవంబరు 14 అమ్మోరు తల్లి

నవంబరు 14 అమ్మోరు తల్లి

నవంబరు 14 ప్రేక్షకుల ముందుకు నయనతార అమ్మోరు తల్లి

నయనతార ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం ‘మూకుతి అమ్మన్‌’. తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా అనువదిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని మిల్కీస్టార్‌ మహేష్‌బాబు విడుదల చేశారు. ఎన్‌.జె.శరవణన్, ఆర్‌.జె.బాలాజీ సంయుక్త దర్శకత్వంలో చిత్రం తెరకెక్కుతోంది. ట్రైలర్లో..‘దేవుడే లేడంటున్న వాడు ఓకే.. ఒక దేవుడిని పొగుడుతూ ఇంకో దేవుడుని తిట్టేవాడు చాలా డేంజర్‌’ అంటోంది నయనతార. కష్టాలను తీర్చమని ఓ కుటుంబం తమ కులదైవమైన మూడు పుడకల అమ్మవారిని ప్రార్థించడానికి వెళ్తే, నిజంగా ప్రత్యక్షమైన అమ్మవారు వారికి ఎలాంటి వరాలు ఇచ్చింది? ఆ తర్వాత ఆ కుటుంబం ఎలా మారిపోయింది? అసలు అమ్మవారు ఎందుకు ఈ భూమ్మీదకు వచ్చారు? నిజంగా ఆమె అమ్మవారేనా? తెలియాలంటే ‘అమ్మోరు తల్లి’ సినిమా చూడాల్సిందే. చిత్రంలో అమ్మోరు రూపంలో ఉన్న నయనతారను మీ శక్తితో ఆన్‌లైన్‌ క్లాస్‌ను క్యాన్సిల్‌ చేస్తారా’ అంటూ అడగ్గా, ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసిన సన్నివేశం నవ్వులు పంచుతోంది. చిత్ర ట్రైలర్‌ని విడుదల చేసిన మహేషబాబు ట్విట్టర్లో..‘‘ఆర్జే బాలాజీ తొలిసారి దర్శకత్వం వహిస్తూ, నయనతారతో కలిసి నటించిన ‘అమ్మోరు తల్లి’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సందర్భంగా చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’’ అంటూ పేర్కొన్నారు. చిత్రం డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ద్వారా నవంబరు 14 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Send a Comment

Your email address will not be published.