నాడు - నేడు

మనుషుల మధ్య కలహం, అనవసర వాదం, అన్నిటా స్వార్ధం …. ఇదే ఈనాటి సమాజం!
కుటిల స్నేహాలు, కుంటి రాజకీయాలు, కపట ధార్మికాలు, నయ వంచనలు ……ఇదే ఈనాటి సమాజం!
కృతఘ్నతాభావం, ఆడంబరవిలాసం, సూటిపోటు మాటలు, సిగ్గుపడని సొగసులు …ఇదే ఈనాటి సమాజం!

మనుషుల మధ్య స్నేహం, పరస్పర గౌరవం, గుండెలోతు నిస్వార్ధం….ఇదే ఆనాటి సమాజం!
కృతజ్ఞత, ధర్మగుణం, నిర్మల భావం, సంతోషం, సమతా భావం…… ఇదే ఆనాటి సమాజం!
మంచి తలచడం, మంచి చెప్పడం, మంచిచేయడం…. ఇదే ఆనాటి సమాజం?

ఓ మనిషీ! నీలోపల ఒక్కమారు నిన్నునువ్వుచూసుకో! నీ అంతరాత్మ తెరుచుకొని నిన్ను నువ్వు తెలుసుకో!

డా.రాంప్రకాష్ యెర్రమిల్లి