"నానీ హిమాలయ మాయం"

"నానీ హిమాలయ మాయం"

నానీకి “ఎవడే సుబ్రహ్మణ్యం” ఒక బ్రేక్ ఇస్తుందనడంలో సందేహం లేదు. గత రెండేళ్లలో చవిచూడని కొత్త మలుపు ఈ చిత్రం నానీకి ఇస్తాదన్నది టాలీవుడ్ వర్గాల మాట. నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యంలో నానీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  నాగ అశ్విన్ దర్శకత్వం వహించడం ఇదే తొలిసారి. అలాగే ఈ చిత్రమే హీరోయిన్ మాళవిక నాయర్ కు కూడా ఇదే తోలి చిత్రం కావడం గమనార్హం. అశ్విని  దత్ కుమార్తె ప్రియాంక దత్ ఈ చిత్రానికి నిర్మాత.

నానీ సుబ్రహ్మణ్యం పాత్రలో నటించారు. అతనో ప్రాక్టికల్ మనిషి. బ్యాంక్ బ్యాలన్స్, బంగాళాలు ఒక స్టేటస్ ఇస్తాయన్నది ఆయన నమ్మకం. జీవితంలో ఇవే ప్రధానమని అనుకుంటారు. నాజర్ పరిశ్రమలో నాని వర్క్ చేస్తూ ఉంటారు. నాజర్ కు రామయ్య సంస్థలో వాటాలు కొందామని అనుకుంటాడు. అంతే కాదు రామయ్య సంస్థను తన సంస్థతో కలుపుకోవాలనుకుంటాడు. అందుకోసం నాజర్ నానీని ఈ విషయమై ఆలోచించమంటాడు. అది కార్యరూపం దాలిస్తే తన అల్లుడిని చేసుకుంటానంటాడు నానీతో నాజర్.

ఇంతలో నానీ బాల్యమిత్రుడు రిషి తనతో రమ్మంటాడు. అక్కడ మాళవికను కలుస్తారు. ఈనేపధ్యంలో నానీ నాజర్ చెప్పిన పనిలో విఫలమవుతారు. మరోవైపు నానీ మిత్రుడు రిషి (విజయ్) రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. నానే తన మితురుడి అస్థికలు తీసుకుని దుద్ కాశికి బయలుదేరుతారు. ఆయనతోపాటు మాళవిక కూడా వస్తుంది. వీరి ప్రయాణంలో కొన్ని మలుపులు జరుగుతాయి.

దర్శకుడు శేఖర్ కమ్ముల స్కూల్ ఆఫ్ థాట్ నుంచి వచ్చిన అశ్విన్ తన ప్రతిభను ఈ చిత్రంలో చూపించడంలో విజయవంతంయ్యాడు. ఈ చిత్రం ద్వితీయార్ధంలో తానేమిటో తెలుసుకోవడం గా కథ సాగుతుంది.

కొన్ని సార్లు ప్రేక్షకుడికి హిమాలయాలపై డాక్యుమెంటరీ చూస్తున్నామా అని అనిపించేలా తీసారు.

మాళవిక తన పాత్రకు అన్ని విధాలా న్యాయం చేసింది.

ఈ చిత్రంలో సాంకేతిక విషయానికి వస్తే సినీమాటోగ్రాఫి చాలా బాగుంది. అది సినిమా విజయంలో ప్లస్ పాయింట్ అవుతుంది అనడంలో ఆలోచించవలసిన పని లేదు.

Send a Comment

Your email address will not be published.