నితిన్‌ సినిమాలో నయనతార

నితిన్‌ సినిమాలో నటిస్తున్న నయనతార

తెలుగు నటుడు నితిన్ – మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హిందీలో వచ్చిన ‘అంధాదున్’‌ చిత్రానికి రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతారతో ఓ కీలక పాత్రలో నటింపజేసేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. బాలీవుడ్‌ ‘అంధాదున్’‌ చిత్రంలో టబు ఓ పాత్రలో నటించింది. ఈ పాత్రలోనే నయనతార నటించాల్సి ఉంది. అయితే ఇప్పటికే చిత్రబృందం పలువురు సీనియర్‌ నటీమణులను కూడా సంప్రదించారు. అయితే ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు. మొత్తం మీద ఓ పక్క కథానాయికగా నటిస్తున్న నయనతార ఇలాంటి వైవిధ్యమైన పాత్రల్లో కూడా రాణిస్తుందేమో తెలియాలంటే కొంతకాలం పాటు వేచి చూడాల్సిందే. నయనతార – విఘ్నేష్‌ శివన్‌ చాలాకాలం నుంచి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వీళ్ల గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయిన నయనతార – విఘ్నేష్‌లు ఓ గుడిలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. అందుకోసం తమిళనాడులోని ఓ జోత్యుష్కుడు సలహా మేరకు అన్ని దేవాలయాలను సందర్శించిన తరువాతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే ఈ ప్రేమికులిద్దరూ కేరళ, తమిళనాడులోని పలు ఆలయాలను సందర్శించారు. తాజాగా వీరు తమిళనాడులోని కుంభకోణం దగ్గరలోని తిరునాగేశ్వరం రాహు ఆలయాన్ని ఇద్దరూ సందర్శించనున్నారట. అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారట. చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పటికే పలు దేశాలు చుట్టొచ్చారు. నయనతార తమిళంలో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ‘మూకుతి అమ్మన్’‌లో చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. విజయ్‌ సేతుపతితో కలిసి ‘కాతువాకుల రెండు కాదల్’ చిత్రంలోనూ చేస్తుంది. ఇందులో సమంత అక్కినేని కూడా నటిస్తోంది.

Send a Comment

Your email address will not be published.