నాలోని మార్పు ప్రపంచానికి మార్పు తెస్తుంది
-రాజ యోగ
భారతీయ సంస్కృతిలో యోగ ఒక అవిభాజ్యమైన అంతర్భాగం. అయితే ఇందులో “రాజ యోగ” అత్యున్నతమైనదని ఒక భావన. రాజ యోగ చేసేవారు క్రమశిక్షణ, నిబద్ధత, ఆత్మవిశ్వాసంతో జీవితంలో పురోగతి పొందుతారని ఒక అభిప్రాయం. స్వామి వివేకానంద “రాజ యోగ” ని పతంజలి యోగ సూత్రాలతో సరిపోల్చినపుడు దీనియొక్క ప్రాముఖ్యత మరింత పెరిగింది. జీవితంలో విజయానికి ఎన్నో మెట్లు ఉంటాయని అంటూ వుంటారు. అయితే ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే రెండే మెట్లుంటాయి. అవి ఆత్మ, పరమాత్మ. రాజ యోగ అంటే రాజసంగా ఆత్మను పరమాత్మతో జోడించడం అని అర్ధం.
బ్రహ్మ కుమరీస్ రాజ యోగకి 6 మెట్లు
రాజయోగ ధ్యానం ద్వారా తీరికలేని మానసిక ఒత్తిడికి గురైన ఆత్మను నిర్మలమైన ప్రశాంత వాతావరణం సృష్టించి దివ్యానుభూతిని పొందే అవకాశం వుంటుంది. ఒక విశిష్టమైన ఆధ్యాత్మికతను పొందడానికి అనుసరణీయమైన ధ్యాన విద్య.
1. కళ్ళు మూసుకోకుండా ఒక గమ్యస్థానం పై చూపు కేంద్రీకరించడం
2. శరీరము, కాళ్ళు, పాదాలు, భుజాలు, మెడ మరియు మనస్సు వదులుగా వుంచడం
3. ఉచ్ఛ్వాసములో శాంతిని పీల్చడం, నిస్వాసంలో బిగువు (Tension)ని విడవడం
4. బుద్ధిని సక్రమర్గాములో ఒక ప్రశాంతమైన గమ్యస్థానానికి తీసుకెళ్ళడం
5. ఆ ప్రశాంతత నిన్నావహించి నిశ్చలమైన మనో నిగ్రహాన్ని గమనించడం
6. వీలైనంత సమయం ఆ ప్రశాంతతలో విహరించడం
1936 లో అప్పటి ఉమ్మడి భారతదేశంలోని హైదరాబాద్ (సింద్) నగరంలో బ్రహ్మకుమారీస్ (బ్రహ్మ కుమార్తెలు) సంస్థ దాదా లేఖ్ రాజ్ అధ్వర్యంలో ఆవిర్భవించింది. పేరులో ఉన్నట్టుగానే ఈ సంస్థలో అత్యధికంగా స్త్రీలు ప్రముఖ పాత్ర వహిస్తుంటారు. ప్రపంచీకరణ దిశగా పయనిస్తున్న ప్రస్తుత పరిణామాల దృష్ట్యా స్త్రీ పాత్ర అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవాలన్న దృక్పధం ఈ సంస్థ యొక్క ప్రధానోద్దేశ్యం. ప్రస్తుతం ఈ సంస్థయొక్క శాఖలు ప్రపంచంలోని 135 దేశాల్లోని 8,500 కేంద్రాల్లో పనిచేస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో అన్ని దిక్కులా సేవా కేంద్రాలున్నాయి. వీరు ప్రధానంగా రాజయోగాను ఒక క్రమ పద్ధతిలో ఉచితంగా బోధించడం గమనార్హం.
బ్రహ్మ కుమారిస్ వారి బోధనలలో ముఖ్యంగా శాంతి, సజ్జనత, నిష్కాపట్యము త్రికరణ శుద్ధిగా వుండాలని చెప్తారు. సమతుల్యమైన సామరస్య ప్రపంచమే పరమావధిగా భిన్న సంస్కృతుల మానవాళికి విభిన్న పాఠ్యాంశములు రూపొందించి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ సంస్థ UN Department of Public Information (DPI) కి అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. లాభాపేక్ష లేని అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ ((NGO) గాUnited Nations Economic and Social Council (ECOSOC) వారితో సలహా సంప్రదింపులు జరుపుతుంది.
సమసమాజం స్థాపించే దిశగా భావార్ధకమైన ఆలోచనా దృక్పధం (Positive Thinking), ఒత్తిడి నిరోధకం (Stress Free Management), ధ్యాన మార్గాలు (Meditation) మొదలైన భాగాలలో ఎన్నో కార్యక్రమాలు భిన్న సంస్కృతుల ప్రజలకు నిర్వహించి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇందులో మన తెలుగువారు స్వచ్చంద సేవకులుగా పని చేస్తున్నారు. మన తెలుగువారు కూడా వీరి ఉచిత సేవలను సద్వినియోగాపరచుకోవాలని బ్రహ్మకుమారీస్ కోరుకుంటున్నారు.
తెలుగువారి కోసం బ్రహ్మకుమారీస్ వారు నిర్వహించే కోర్సులు అన్నీ ఉచితం.
ఆస్ట్రేలియా వెబ్సైటు: www.brahmakumaris.org.au
గ్లోబల్ వెబ్సైటు: www.brahmakumaris.org