నేను రాజమౌళి వీరాభిమానిని

నేను రాజమౌళి వీరాభిమానిని

తమిళ దర్శకుడు శంకర్ కి టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి అంటే పిచ్చ ఇష్టం. తానూ రాజమౌళి వీరాభిమానినని శంకర్ చెప్పుకున్నారు. రాజమౌళి తెలుగులో తీసిన చాలా సినిమాలు తమిళంలో డబ్ చేస్తే అవన్నీ విజయవంతమయ్యాయని అన్నారు. భారత చలన చిత్ర రంగంలోని మేటి దర్శకుల్లో ఒకరుగా ఖ్యాతి గడించిన శంకర్ ఇటీవల తన సినిమా ప్రమోషన్ సమయంలో రాజమౌళిని ప్రత్యేక అతిధిగా ఆహ్వానించడం విశేషం.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా చూసినప్పటినుంచి తానూ ఆయన అభిమానినయ్యానని శంకర్ చెప్పుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న బాహుబలి సినిమా ఎప్పుడు తెర మీదకు వస్తుందా అని తను ఎదురుచూస్తున్నానని శంకర్ తెలిపారు. బాహుబలి సినిమా చిత్రీకరణ కొంత వరకు చూశానని, అది అంతర్జాతీయ స్థాయిలో ఉందని అన్నారు.

తెలుగు అభిమానులు తన సినిమాలను ఆదరిస్తున్నందుకు శంకర్ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. తాను ఒక తెలుగు సినిమాకు దర్శకత్వం వహించడం ద్వారా వారికి దగ్గరయ్యానని, తాను తాజాగా దర్శకత్వం వహించిన ఐ చిత్రం రొమాంటిక్ థ్రిల్లర్ అని అన్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు విపరీతంగా ఉన్నాయని చెప్పారు. అభిమానుల అంచనాలను ఐ సినిమా ఏ మాత్రం వమ్ము చేయదన్న నమ్మకాన్ని శంకర్ వ్యక్తం చేసారు.

Send a Comment

Your email address will not be published.