నేను

నేను పుట్టేక నాకొక పేరు
పుట్టక ముందే అమ్మ కడుపులో నాకొక పేరు
మరి పుట్టిన దెవరు? ” నేను ”
అంతమందికి అన్ని పేర్లు
అందరికి ఒకటే పేరు
ఎవరికీ వారికి ఒకటే పేరు
ఆ పేరే “నేను”
నన్ను పిలిచేదేన్నో పేర్లతో
అన్ని పేర్లకీ పలుకుతాను
కాని నా అసలు పేరు “నేను ”
నాకొక పేరు నీకొక పేరు
మరి నేనెవరు? నీవెవరు?
నీకు నీవు నేను, నాకు నేను నేను
నేనూ నీవూ ఒకే “నేను”
మరి ఈ నేను ఎవరు ?
అదే “ఆత్మ ”
ఈ భూమ్మీదికి ఎక్కడ నుంచి వచ్చేను ?
నా ప్రయాణం ఎక్కడి వరకు ?
ఎప్పుడు మొదలైంది ? ఎప్పుడు ముగుస్తుంది ?
ఆదీ అంతం లేనిదిది
ఇప్పటికిది జీవన్మరణాల మధ్య ఒక మజిలీ .
దేహ పంజరమందు మాయచే బంధింపబడిన ఆత్మయే
అకాశ మందు సర్వ వ్యాప్తకమైన ఆత్మ
అదే నిత్య,శుద్ధ ,బుద్ధ ,సత్య పరమాత్మ
ఆత్మ, స్వస్వరూప మెరిగి, పరమాత్మలో లీనమగుటే,
ఈ జన్మ పరంపరాగత జీవయాత్ర
సమాప్తి నొందు పరా కాష్ఠ