నేల నింగిల ప్రేమ కలాపం

ప్రియతమా అని వర్షపు బిందువులతో పలకరిస్తే
నేస్తమా అని మెరుపుల మేఘం స్నేహహస్తం అందిస్తే
నా హృదయాన్ని తెలియని కదలిక ఏదో కలవరిస్తే
ఓ నిచ్చెలీ నీ రాక ఆలఓకగానే గమనిస్తే…

నీ ఎడబాటుకు ఎదలో రోదిస్తున్నానని తెలుసుకోలేక పోయావు
మౌనంగా ఉన్నానని పిడుగుల శబ్దం చేసావు
నా మదినిండా నీ తీయని తలపులు చూడలేక పోయావు
సప్తరంగుల హరివిల్లుతో నన్ను చక్రబంధంలో బందించావు

ఎప్పుడూ కలిసే అవకాశం లేని ప్రేమికులము
ఈ విస్వాంతరాళంలో ప్రేమగా ఒదిగి ఉందాము
భగ్న ప్రేమికులకు మనమే స్పూర్తినిద్దాం
లైలా మజ్నూలా అమర ప్రేమకు చిహ్నమౌదాం

మన మధ్యనున్న దూరం కొలతకు రాదు
మదిలోని రాగాలు వినిపింపగా వీలు కాదు
నా మౌన భాష లోని కన్నీటి ఘోష వినరాదా!
అక్కున చేర్చుకొని మచ్చికగా అద్డుకోరాదా!!!

—మల్లికేశ్వర రావు కొంచాడ