న్యూజీలాండ్ లో ఘనంగా ఉగాది వేడుకలు

DSC_0594
DSC_0654
DSC_0603
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి అధ్వర్యంలో జరిగిన ప్రపంచ మహాసభలు స్పూర్తిగా తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూ జీలాండ్ విలంబి ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తూర్పు దిక్కున ఉండి అన్ని దేశాలకు తలమానికంగా ఉన్న ఒక ప్రాశ్చాత్య దేశంలో తెలుగు భాషను రెండవ భాషగా బోధించడానికి అనువుగా వినతిపత్రాలు సమర్పించాలని ఈ సభలో ప్రత్యేకించి ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం ఎంతో ముదావహం.

తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూ జీలాండ్ ఆధ్వర్యంలో విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆక్లాండ్లోని మౌంట్ రస్కిల్ వార్ మెమోరియల్ హాల్ లో ఆనరరీ ఇండియన్ హై కమిషన్ అఫ్ న్యూ జీలాండ్ భావ్ దిల్లోన్,భికూ బాణా ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముఖ్య అతిధులుగా నిర్వహింప బడ్డాయి . ఈ కార్యక్రమానికి న్యూ జీలాండ్ లోని తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు .

DSC_01390
DSC_02021
ఉగాది వేడుకల్లో భాగంగా ఉగాది ప్రాముఖ్యతను ఉమా రామారావు రాచకొండ వివరించగా ,సందీప్ కుమార్ ప్యారాక ఆచార్య పంచాంగ శ్రవణం , తెలంగాణ సంస్కృతి కి అద్దం పట్టే పలు సాంసృతిక , నృత్య ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి . వండర్ గర్ల్స్ , తెలంగాణ హార్ట్ బీట్స్ గ్రూప్స్, మరియు ఫాషన్ షో ప్రదర్శనలు కనులవిందుగా ఉండి ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి .ఆరోగ్యమే మహాభాగ్యం లో భాగంగా “నెగ్గాలంటే తగ్గాలి ఛాలెంజ్ “ కు శ్రీకారం చుట్టడం జరిగింది.  కార్యక్రమానికి విచ్చేసిన అందరికి ఉగాది పచ్చడి తో పాటు,తెలంగాణ శాఖాహార విందును ప్రసన్న , గిరిధర్ , శ్రీహరి
ఏర్పాటు చేసారు .

DSC_073411
ట్యాంజ్ అధ్యక్షుడు శ్రీ కళ్యాణ్ రావు కాసుగంటి ఉగాది కరదీపికలు ముద్రించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి , ఉగాది సంబురానికి విచ్చేసిన వీక్షకులకు పుస్తకాలను అందించడానికి సహకరించిన తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ హరికృష్ణ మామిడి గారికి , తెరాస న్యూ జీలాండ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కోసిన గారికి కృతజ్ఞతలు తెలిపారు .తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్ర శేఖర్ రావు గారు , తెలుగు ప్రపంచ మహాసభలు జరపడం , తెలుగును తప్పనిసరి సబ్జెక్టు గా చెయ్యడం గొప్ప పరిణామం.  అలాగే తెలుగును న్యూ జీలాండ్ లో ప్రోత్సహించేందుకు వీలుగా ఇండియన్ అసోసియేషన్ టాగోర్ లైబ్రరీ లో తెలంగాణ సంస్కృతి , సంప్రదాయం , భాష , యాస సూచికలైన పలు పుస్తకాలను వుంచబోతున్నట్టు గా మరియు న్యూ జీలాండ్ ప్రభుత్వానికి తెలుగును రెండవ భాష ఆప్షన్ గా పాఠశాల లో భోధించడానికి వినతి చేస్తామని తెలిపారు .

ఈ కార్యక్రమం ట్యాంజ్ అడ్వైసర్ శ్రీ నరేందర్ రెడ్డి పట్లోళ్ల పర్యవేక్షణలో  నిర్వహింప బడ్డాయి.ఈ కార్యక్రమానికి ట్యాంజ్ కార్యవర్గ సభ్యులు ,జనరల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి ఎడవల్లి
నర్సింగ రావు పట్లొరి, విజేత రావు,రామ రావు రాచకొండ , జగన్ రెడ్డి వాడ్నలా, రామ్మోహన్ దంతాల , రామ్ రెడ్డి తాటిపత్రి, వినోద్ రావు ఎర్రబెల్ల ,లక్ష్మణ్ కలకుంట, తదితరులు సహకరించారు.
DSC_0300
DSC_0043
DSC_0297

Send a Comment

Your email address will not be published.