పండిన కల

పండిన కల

విజయ్ దేవరకొండ కల పండింది. త్వరలో రాబోతున్న ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించడం ద్వారా విజయ్ కల సాకారమైంది.

హైదరాబాదులో పుట్టి పెరిగిన విజయ్ కు మొదట శేఖర్ కమ్ముల సమర్పించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఆ సినిమాకు నాగ అశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. ఆ నాగ అశ్విన్ ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకి దర్శకత్వం వహించారు.

విజయ్ దేవరకొండ కెరీర్ లో ఓ యాడ్ ఫిలిం పెద్ద మలుపే తీసుకు వచ్చింది.

ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రానికి ప్రియాంక దత్ నిర్మాత. ఆమె విజయ్ చేసిన యాడ్ ఫిలిం కి కూడా నిర్మాత.  విజయ్ వర్క్ అంటే ఇష్టమున్న ప్రియాంక ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకి ఆడిషన్ కి పిలవడమే కాకుండా నర్తించే అవకాశం కూడా ఇచ్చారు. అందుకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు విజయ్ దేవరకొండ.

అంతకు ముందు అనేక నాటకాలలో నటించినప్పటికీ విజయ్ కి సినిమా మొదటి రోజు షూటింగ్ అనుకున్నంత సులువుగా సాగలేదు. తొలి రోజు షూటింగ్ అంతగా సంతోషాన్ని ఇవ్వలేదని చెప్తూ రెండో రోజు షూటింగ్ తర్వాత అన్నీను ఒక క్రమ పద్ధతిలోకి వచ్చిందని అన్నారు. ఏదేమైనా ఆ సినిమా షూటింగ్ మొదటి రోజు తనకో గొప్ప అనుభవమని చెప్పిన విజయ్ హైదరాబాదులోని బద్రుకా కాలేజీలో కామర్స్, ఆర్ట్స్ చదువుకున్నారు. ఎవడే సున్బ్రమన్యం సినిమాలో హీరో నానితో కలిసి పని చెయ్యడం మరచిపోలేనిదని అన్నారు విజయ్. నాని కూల్ పర్సన్ అని, ఆయనతో కలిసి పని చెయ్యడం ఆనందకరమైన విషయమని చెప్పారు. ఈ సినిమాలో తానూ ఫ్రీగా మెలగడానికి కారకులైన దర్శకులు, నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పిన విజయ్ స్వప్న దత్ కూడా ఎంతో సహకరించారని అన్నారు.

ప్రస్తుతం ఆ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న విజయ్ ప్రియాంకా, స్వప్నా దత్ లతో మూడు చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మంచి కథల కోసం కూడా ఎదురుచూస్తున్న విజయ్ కొందరు దర్శకులను కలుసుకోవడంలో ప్రియాంకా ఎంతగానో సహకరిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.