"పటాస్" పేల్చారు

"పటాస్" పేల్చారు

పటాస్…..పేల్చారు. కానీ అది ఎంతవరకు దాని ప్రభావం మిగిల్చింది అనేది ఆలోచించవలసిందే. కథలో కొత్తదనం లేదనే టాక్ వచ్చేసింది.

ఈ చిత్రానికి హీరో, నిర్మాత కళ్యాణ్ రామే.

దర్శకత్వం వహించింది మాత్రం రావిపూడి అనిల్. ఆయనకు ఇది మొదటి చిత్రం దర్శకుడిగా.

హైదరాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్‌ పాత్రలో కళ్యాణ్ రామ్ నటించారు. వ‌స్తాదు. డబ్బులు వసూలు చేసే పాత్ర అతనిది. తన పనులకు పోలీస్ స్టేషన్ నే కేంద్రంగా చేసుకుంటాడు. తన తోటి వారిని కూడా ఎంత కావాలంటే అంత సంపాదిన్చుకోమని చెప్తాడు. పోలీసోడు నిజాయ‌తీగా ఉండ‌వలసిన పని లేదంటాడు. మరోవైపు డిజిపి పాత్రలో నటించిన సాయికుమార్ నీతికీ నిజాయ‌తీకి మారుపేరు. డబ్బులు వసూలు చేసే కథనాన్ని దర్శకుడు ’పటాస్’ టైటిల్ తో మలుపులు తిప్పుతూ ముందుకు నడిపించాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ కి ఇదొక పునర్జన్మనిచ్చే చిత్రంగా చెప్పుకోవచ్చు.

ఈ చిత్రంలో హాస్యంపాలు ఎక్కువే ఉంది. అందుకే బోరుకోట్టదు చూస్తున్నంతసేపు. మొదటి హాఫ్ లో పంచ్ డైలాగులు బోలెడు ఉన్నాయి. ఆ తర్వాత కథ సీరియస్ గా సాగింది.

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ తోపాటు శృతి సోది, శ్రీనివాస్ రెడ్డి, ఎం ఎస్ నారాయణ, సాయికుమార్, అశుతోష్ రానా తదితరులు నటించారు.

అవినీతిపరుడి పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్ ఎలా నిజాయితీపరుడుగా మారాడు? ఏ సంఘటన అతనిని మార్చింది? అతని ప్రేమ జీవితం విజయపధంలో సాగిందా ? వంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే పటాస్ చిత్రం చూడాలి.

సంగీతం సాయి కార్తిక్.

Send a Comment

Your email address will not be published.