పద్యమా ? కవితయా ?

గణవిభజన మించి గమనమ్ము గమనించు !
పద్య మన్న చవులు బాగ పెరుగు ,
యతులు ప్రాస నియతు లలవాటు గామారు
పోతనార్యు భాగ వతము చదువు

పద్య మొక్కటి మంచిది పట్టి రుక్కు
వల్లె వేయుము దానిని వంద సార్లు
చంద బంధము లన్న చొ జంకు సడలు
అంద మో నడలవి పెట్టు యెదను చాళ్ళు

భావ కవిత పధము -పద్య సంధానము ,
మాధ్య మెడమె గాని , మనసు సమమె
భావుకతల లోటు , బాధించు రెంటినీ !
చందబంధముండి సడలి కూడ !

బధ్ది తంబ య్యి , తాస్వానుబద్ద మయ్యి
ఒకలయ ఒక గతి చెలగ నుల్లమందు
కవితగానది ప ద్దెం పు కట్టు గాని ,
ఆ లయల గతుల మతుల నంద వలయు !