పురుష ప్రేమ

ప్రకృతి నుంచి పుట్టు తనువు!
ప్రకృతి సహజ వికాసము నొందు!
ప్రకృతి సిద్ధమౌ గుణగణము లబ్బు!
ప్రకృతి దాట తరమా! ప్రయాసమే కాని!

ప్రేమతో శిలలను కూడ కరిగించ వచ్చు!
ప్రేమతో పిల్లల మనసులు గెల్వ వచ్చు!
ప్రేమతో మన రీతిని మెల్వగ చెప్పవచ్చు!
ప్రేమకు సాధ్యము కానిది లేదు మానవా!

ప్రకృతి పురుష సమ్మేళన సృష్టి యంతయు!
పురుషప్రేమను వికసించును నిత్యము ప్రకృతి!
ప్రకృతి మార్పు సహజము! మారదు సృష్టి ధర్మము!
ప్రకృతిపురుషుని ఉఫాది! వేరుగ గుర్తిoచుము మానవా!

–డా. రాంప్రకాష్ ఎర్రమిల్లి