పుస్తకం మీద జరిమానా రద్దు

పుస్తకం మీద జరిమానా రద్దు

లైబ్రరీలో చదువుకోవడానికి పుస్తకాలు తీసుకున్న వారిలో తిరిగివ్వకుండా తమ వద్దే ఉంచుకునే వారు ఎక్కడో అక్కడ ఉంటూనే ఉంటారు.

అయితే అమెరికాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది.

అమెరికాలోని న్యూ బెడ్ ఫోర్డ్ నగరంలో ఉన్న ఓ ప్రభుత్వ లైబ్రరీకి వెళ్లి 75 ఏళ్ళ మాన్స్ ఫీల్డ్ పుస్తకం తిరిగిచ్చాడు. ఇందులో ఏముంది అనుకోకండి….ఇక్కడే అసలు విషయముంది. అతను తిరిగిచ్చిన పుస్తకం తాను తీసుకున్నది కాదు. తన తల్లి ఆ లైబ్రరీ నుంచి తీసుకుని తన వద్దే ఉంచేసుకున్న పుస్తకం అది. ఆమె తదనంతరం ఇల్లంతా సర్దుతుండగా ఈ పుస్తకం బయటపడింది. దాని మీద లైబ్రరీ స్టాంప్ ఉండటం, తిరిగివ్వాల్సిన తేదీ అంత చూసి మాన్స్ ఫోర్డ్ లైబ్రరీకి వెళ్లి అక్కడి అధికారికి తిరిగిచ్చాడు. అప్పటికి 99 సంవత్సరాలైంది ఆ బుక్కు లైబ్రరీ నుంచి బయటకు వెళ్లి. లైబ్రరీ అధికారులు పుస్తకాల రాకపోకలపై ఓ రికార్డు తయారు చేసినప్పుడు ఈ పుస్తకం చోరీకి గురైనట్టు తెలుసుకున్నారు. దానితో ఆ పుస్తకం మీద 360 డాలర్ల జరిమానా వేశారు. అయితే మాన్స్ గార్డ్ తన తల్లి చేసిన తప్పు చెప్పి పుస్తకాన్ని అప్పగించినందుకు లైబ్రరీ అధికారి అతనిని అభినందించి జరిమానా రద్దు చేయడమే కాదు, ఆ పుస్తకాన్ని ఓ అరుదైన పుస్తకంగా తమ లైబ్రరీలో ప్రదర్శనకుంచారు. అంతేకాదు, మాన్స్ ఫోర్డ్ నిజాయితీని కొనియాడుతూ లైబ్రరీలో ఓ నోట్ కూడా ఉంచారు.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.