ప్రభాత సమయం

ప్రభాత సమయం పరిమళ భరితం ,
రజనికి వీడుకోలు, రవికి స్వాగతం పలుకు ,
రసమయ తేజోమయం వింత వింత సుగంధ సమ్మిళిత
ఉత్కంట భరితo ఉషోదయం ||ప్రభాత ||

నల్లని నిశీధి నిండిన జగతిని తెల తెల్లని
వెలుగురేఖలు మెల మెల్లగ వెల్లి విరియు ,
తొలి తొలి వెలుగుల విరాజమానం ,
బాలభానుని లేలేత కిరణ పున్జములు,
ఇలా తలమంత ప్రసరించి కాంతులు నింపు ,||ప్రభాతసమయం||

పచ్చని పైరులు,తరులత లన్నీ పసిడి వెలుగుల
మెరిసి తలలూచి పాడు,ఝాము వేకువఝాము.,
పచ్చని గరికపై రేయంత కురిసిన
మంచు ముత్యాల సరాల తళుకులతో
సూర్య కిరణములేకమై
పంచవర్ణాల మెరసి మనసుల తనువుల
మైమరపింఛి ఉత్తెజము కలిగించు ||ప్రభాతసమయం.||

వివిధ వర్ణాల విరుల సుగంధపరిమళముల నాస్వాదించి ,
విలాసముగా విహరించు
పిల్లతెమ్మెరలు, వేకువఝాము,
ప్రక్రుతి శోభల పరవసించి పాడు
కుహూ, కుహూ కోయిల గానాలు,
గూడులు వీడి గగనవీధిని విహరించు
వన్నెచిన్నెల వైవిధ్య విహంగ రాజములు,
కిల కిలారావములు,||ప్రభాతసమయం,||

పురివిప్పి ఆడు మయూర నాట్యభంగిమల
సొగసులు,తిలకించగా నయనానందం,
అపురూప ఆహ్లాదం గూర్చు,ఉషోదయం.
పల్లెపట్టుల గల గలా పారే సెలయేటి
గల గలారావాలు,
ఉరుకుల పరుగుల సాగరతరంగ దుందుభి నాదాలు.
వేకువఝాము.||ప్రభాతసమయం||

జీవకోటి నవ్యతేజముప్పొంగి,
దినచర్యలకుపక్రమించు,ఉషోదయం.
హరిత వర్ణాల వలువలు గట్టి,
నవరత్న సొగసుల ఫల పుష్పసరాల
హారముల దాల్చిన ప్రకృతికాంత
ప్రభాతసోభాన్విత పుడమితల్లికి
ఒద్దికగా ప్రణమిల్లు ప్రభాతసమయం
అపురూపం,అత్యద్భుతం .

By
కామేశ్వరీ సాంబమూర్తి.భమిడిపాటి.
పి. ఏఎ .యు. ఎస్. ఎ