ప్రభాస్‌ చిత్రంలో ‘ప్రేమపావురాలు’ భాగ్యశ్రీ

రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ప్రేమకథగా తెరకెక్కుతున్న చిత్రంలో ప్రభాస్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా పూజాహెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ని విదేశాల్లో చిత్రీకరించారు. అయితే ఇందులో బాలీవుడ్‌ నటీనటులు కూడా నటిస్తున్నారు. అయితే అలనాటి ‘ప్రేమపావురాలు’ కథానాయిక సీనియర్‌ నటి భాగ్యశ్రీ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించనున్నారని ఎప్పట్నుంచో వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం గురించి భాగ్యశ్రీ స్పందిస్తూ…‘‘మీరు అనుక్నుది నిజమే. నేను ప్రభాస్‌ చిత్రంలో నటిస్తున్నాను. ఒక నటిగా నాకు మంచి పాత్ర అవుతుందనే నమ్మకం ఉంది. చాలా ఏళ్ల తరువాత తెలుగులో నేను నటిస్తున్నా. మరోసారి తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ’’ చెబుతోంది. ఇప్పటి వరకు ‘జాన్‌’గా పిలుచుకుంటున్న ఈ సినిమాకి ‘రాధే శ్యామ్‌’, ‘ఓ డియర్‌’లాంటి పేర్లను చిత్రబృందం పరిశీలిస్తుందట. భాగ్యశ్రీ తెలుగులో రాజశేఖర్‌తో కలిసి ‘ఓంకారం’, తరువాత బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘రానా’ చిత్రంలో ఆయన చెల్లెలు డాక్టర్‌ కస్తూరిగా మెప్పించింది.

Send a Comment

Your email address will not be published.