ప్రభాస్‌ తో నటిస్తున్న నివేదా...

ప్రభాస్‌ తో నటిస్తున్న నివేదా...

ప్రభాస్‌ తో నటిస్తున్న నివేదా థామస్‌

గత ఏడాది ‘దర్బార్‌’ చిత్రంలో రజనీకాంత్‌ కూతురుగా వల్లికన్ను పాత్రలో అలరించింది నటి నివేదా థామస్‌. ప్రస్తుతం తెలుగులో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తోన్న ‘వి’ చిత్రంలో నటించింది. తాజాగా ఈ అమ్మడు వైజయంతి మూవీస్‌ నిర్మిస్తున్న చిత్రంలో ప్రభాస్‌ సరసన నటించనుందని వార్తలోస్తున్నాయి. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నివేదాను ఓ కీలక పాత్ర కోసం సంప్రదించి, స్ర్కిప్టుని కూడా వినిపించారట. కథ విని పాత్ర పట్ల ఆకర్షితురాలైందని చెప్పుకుంటున్నారు. అంటే ప్రభాస సరసన నివేదాను కూడా చూడొచ్చన్న మాట. పాన్‌ ఇండియాగా చిత్రంగా తెరకెక్కుతోన్న సినిమాలో ఇప్పటికే దీపికా పదుకొణె ప్రధాన కథానాయికగా నటిస్తోంది. తెలుగులో ‘నిన్ను కోరి’, ‘జెంటిల్‌మెన్‌’, ‘బ్రోచేవారెవరురా’లాంటి వైవిధ్యమైన సినిమాలతో తన సత్తా నిరూపించుకుంది నివేదా థామస్‌. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన గురించి చెబుతూ..’’మీరు నమ్ముతారో లేదో.. నాకైతే విలన్‌గా నటించాలని ఉంది. అలాంటి పాత్రల గురించి ఎన్ని ఆలోచనలు వస్తుంటాయో. నన్ను అందంగా, మంచి అమ్మాయిగానే చూస్తున్నారు. అందుకు భిన్నంగా అందరూ ద్వేషించే పాత్రలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా’’ని చెప్పింది. ప్రస్తుతం నివేదా తెలుగులో ‘వకీల్‌ సాబ్’‌, ‘శ్వాస’, సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది.

Send a Comment

Your email address will not be published.