ప్రవాసం లో నివాసం..

అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు
అందరు ఎయిర్ పోర్ట్ కొచ్చారు
వేళకి ఇంత తిను అని అమ్మ
అందరితో మంచిగా వుండు అని నాన్న
ఏ అవసరం వచ్చిన కాల్ చేయరా అని అక్క
అన్న- సంక్రాంతికి వస్తావుగా అని తమ్ముడు
అందరికి నేనంటే అంత ప్రేమ, నాకు మాత్రం
నా బవిష్యతు గురించి బెంగ, డబ్బు సంపాదనే ద్యేయం ||ప్రవాసం లో నివాసం – ఓ రాముని వనవాసం||

వచ్చిన కొన్ని రోజులకే మీసం మాయమయ్యింది,
పేరు పోట్టిదయింది, పర్సు పెద్దదయింది
ఉద్యోగం కోసం ఉరుకులు పరుగులు
పని ఏదయినా ఆదాయం వస్తే చాలు అనే తత్త్వం ||ప్రవాసం లో నివాసం – ఓ రాముని వనవాసం||

ప్రపంచంలో ఏ దేశ వంటలైన రుచి చూడగల సౌలబ్యం
కానీ అమ్మ చేతి వంట కోసం ఆరాటం
ఫోన్ చేసిన ప్రతి సారి, అయ్యా భోంచేశావా అనే అమ్మమాట
తినకపోయినా కడుపునిండుతుంది ||ప్రవాసం లో నివాసం – ఓ రాముని వనవాసం||

ఏదో సాదించాలని తపన
ఎంత సంపాదించినా ఏదో వెలితి
డాలర్లని రూపాలోకి మార్చగాలుగుతున్నా కానీ
నా ప్రేమని కన్న వాళ్ళకి పంచలేకపోతున్న ||ప్రవాసం లో నివాసం – ఓ రాముని వనవాసం||

ఈ బందాలు బందుత్వాలు ఎంతో బలమైనవి
ఎన్ని వేల మైళ్ళ దూరంలో వున్నా
ఒకర్ని ఒకరు తలుచుకుంటూనే వుంటాం
కలుసుకునే రోజు కోసం ఎదురు చూస్తూనే వుంటాం
– కృష్ణ శ్రీ కాన్బెర్రా