ప్రశ్నలు

వలపు చినుకులు కురిసే నాలోన నాల్గు
విరిపొదల పిలుపులవి నాకోసమేనా..??
అప్రాప్తసౌందర్యం అమలినశృంగారం
మదీయ మయూరమిట పూరి విప్పెనేలా..??

ఈ గాలి తెమ్మెరల గుసగుసల ఊసేమి..??
ఆ పూలపై వాలు తుమ్మెదల పాటేమి..??
ఓ కలువ నన్నలా కవ్వించు కథ ఏమి..??
ఏ మల్లియ ఎచటైన విరబూసేనా ఏమి…??

నవభావపక్షముల నునులేత రెక్కలసడి
నాలోన రసోదయపు సుప్రభాతమాయెలే..
కేదార రాగమొకటి కడుతీయగా పాడి
ప్రణయమేఘమాల నాలో మాయమాయెలే..

–రమాకాంత్ రెడ్డి