ప్రాంతీయ విభజన విప్లవం

మానవుడా వో మానవుడా ! మేధస్సు స్తంభించిన భీరువుడా !
నాది నాది అని ఉరకలు వేసావు !
ప్రాంతీయ విభజన కొరకు విదిచేత పావు వలె చిక్కావు !
మానవ మనుగడకే విషవలయం కలిగించావు!

తెలుగు రాష్ట్ర అవతరణకు అసువులు బానిన పొట్టి శ్రీరాములు జీవించియున్న
ఈ జాతి – ప్రాంతీయ విభజన చూసి గుండెలు పిండు బాధను సహించగలడా !
తన జాతి ప్రభావమ్ము గుండె విరిచి “పొగడర నీ జాతి ని” అని గర్జించిన
రాయప్రోలువారు – ఈ కుటిల, స్వార్ధ రాజకీయ విప్లవం చూసి
క్షణమైనా నిశ్చింతగ నిదురించ గలరా !

తెల్లవారి గుండెలలో నిదురించిన “సీతారామ రాజు” జీవించియున్న
నేనెందుకు నా జీవితమును స్వాతంత్ర సమరమునకు అర్పించి –
మానవ జీవన ముఖ్యొద్దెశమును ఏమరచిథిని అని తలచి మరియొకసారి
ఆత్మాహుతి కావించుకో గలడు నిస్సందేహముగా !

ప్రాంతీయ విభజన తెలుగు మాతకు గర్భశోకం ఒకే తల్లి బిడ్డలు ఆస్తులకోసం హత్యలు జరిపినట్లు
దొంగలు దొంగలు కలసి ఊళ్ళు దోచుకున్నట్లు – వొకే దేశపు ప్రజలు పరస్పర అంతః కలహాల పరిణామం !
ఒకే ఒక స్వార్ధపూరిత రాజకీయ నిక్రుష్టుడికోసం – మీ అనుబంధాలు, ఆశువులను , అన్న తమ్ములను
బలి పెట్టు మూర్ఖ మానవుడా – నీ మేధస్సును పదును పెట్టు
నీ లోని మానవత్వమును ఉత్తేజ పరుచు
సహ జీవన ధోరణి అలవరచు – సమ సమాజమును ప్రోత్సహించు !

మానవుడా వో మానవుడా ! మేధస్సు స్తంభించిన భీరువుడా !