ప్రార్ధన

తల్లి-తండ్రి-గురువు-దాత-దైవ – మెల్ల
గతులు – నీవ యని నమ్మి నిత్యంబు సేవలిడుదు
ప్రీతి నా పరిచర్యల స్వీకరించి సకల శుభముల
నిమ్ము శ్రీ సాయి దేవా॥

గొడ్డురాలైన పొలతి కి కొడుకు లబ్బె
మరణ మందిన మనుజుడు తిరిగి బ్రదికె
అగ్ని వాయువు జలము నీ యాన మెలగె
చనునె నీ లీల లెరుగ శ్రీ సాయి దేవా॥
ఆర్త రక్షక బిరుదాంక అభయమిమ్ము
సాధుకుల దీప కోరిన సాయమిమ్ము
నిత్య కల్యాణ నన్ను మన్నింప రమ్ము
సత్య శీల పాలింపు శ్రీ సాయి దేవా॥

గీ॥ సకలమును తానె యౌచును జగతి వెలిగి –
అఖిల జగముల కాధారమగుచు దనరి –
ఒప్పి యున్నట్టి బ్రహ్మంబె తప్పకుండ –
సత్య కరుణా ప్రవర్తి – శ్రీ సత్య సాయి॥

–క్రీ. శే. శ్రీ నలనాగుల చంద్ర శేఖర రావు