ప్రియతమా.. కుశలమా..

ప్రియతమా.. కుశలమా.. ఎడబాటు ఎన్ని నాల్లిల
నువ్వలా.. నేనిలా .. నీలాల నింగి- నేలలా !!2!!

మనస్సు మౌన భాషలో .. లిఖించే నెన్ని లేఖలో..
వయస్సు చిలిపి ఆశలో .. తపించే నెన్ని రోజులో..

పెదాల మాటు దాటనీ.. పదాలు ఎన్ని వేలనీ ..
మనస్సు ఉహాకందనీ .. భావాలూ ఎన్ని ఎన్ననీ…

చుక్కలే… దాటన.. క్షణాలలో నిన్ను చేరగా..
చినుకులే రాలవా.. నాలోని ప్రేమ కరుగగా ..

నీపైన నాకున్న ప్రేమనే … చెప్పేదెలానే భావనే ..
పోసింది నా ఊహకు ప్రాణమే .. తెచ్చింది ఈ కవితనే ..

ఎలాగనీ.. చెప్పేదనీ.. నాలోన దాగి ఉన్న ప్రేమ నువ్వని …
నాలోన శ్వాస నీకనీ …

కుశలమా.. ప్రియతమా.. ఎడబాటు ఎన్ని నాల్లిల
నువ్వలా.. నేనిలా .. నీలాల నింగి నేలలా !!2!!