ఫలక్ నుమా ప్యాలస్ లో...

ఫలక్ నుమా ప్యాలస్ లో...

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత, ఆయుష్ శర్మతో తన పెళ్లిని హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలస్ లో చేసుకోవడానికి ఆరాటపడుతోంది. అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది అర్పిత పెళ్లి ఆయుష్ శర్మతో జరుగుతుంది. అయితే అర్పిత కోరిక మేరకు ఫలక్ నుమా ప్యాలస్ ను వివాహ వేదికగా చేసుకోవడానికి అర్పిత కుటుంబ సభ్యులు ఆ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏదేమైనా అర్పిత ఈ ఫలక్ నుమా ప్యాలస్ లోనే తన పెళ్లి జరగాలని ఆశిస్తోంది. ఈ వేదిక ఖాయం చేసుకోవడంపై త్వరలోనే తుది నిర్ణయానికి  వచ్చే వీలున్నట్టు అర్పిత సన్నిహిత వర్గాల భోగట్టా.

మరోవైపు అర్పిత తండ్రి సలీం ఖాన్ ఈ వార్తలను ఖరారుచెయ్యనప్పటికీ ఫలక్ నుమా ప్యాలస్ ను వేదికగా చేసుకునే చర్చలు ఇంకా  కొనసాగుతున్నాయని తెలిపారు.

ఇలా ఉండగా, అర్పిత నిశ్చితార్ధం ముంబైలోని ఒక ఫార్మ్ హౌస్ లో జరిగింది.

Send a Comment

Your email address will not be published.