బహువిధి భర్త

ఆనాటి పతులందరేమనుభవించెన్
ఆభోగమీనాటి పత్నులకే దక్కెన్
మా చేతికి కాఫీలు రాలేదు సరికదా
మా చెత కాఫీలు పెట్టించెరా

పగలంత పనిజేసి ట్రాఫిక్కులో ఈది
సూర్యాస్తమాయాన నట్టింటిలో జేరి
ఓ పక్క పిల్లాడి హొంవర్కులే జూడ
ఈ పక్క వంకాయ కూరొండెరా

మీ అమ్మ ఏదంటు పిల్లవానినే అడుగ
ప్రాజెక్టు మీటింగు లేటాయనని జెప్పె
అసురాసుర క్రోదమ్ము లోలోపలే దొక్కి
పిల్లాడి స్నానంబు, డిన్నర్లు క్రమ పరిచెన్

ఆధునిక పతులంటు అంట్లన్ని తోమేసి
దుస్తులను ఉతికేసి ఇల్లంత క్లీన్ జేసి
అలసి వచ్చిన ఆలికి తేనీరు అందించి
ఈనాటి పతులపై నే నవ్వుకొంటిన్
–శ్రీకృష్ణ రావిపాటి, బ్రిస్బేన్