భాగవతం కథలు - 18

విష్ణువు నాభి నుంచి జన్మించిన బ్రహ్మ నిజచ్చాయతో నామ రూప గుణ సంజ్ఞా సమేతమైన సృష్టిని కల్పించాడు. అవిద్యను సృజించాడు. అవిద్య అంటే – తామిస్రము, అందతామిస్రము, తమము, మొహం, మహామొహం అనే పంచ మోహరూపం. ఆటర్వాయ ఆ శరీరాన్ని వదిలేసి మరో శరీరాన్ని ధరించాడు. ఆయన తొలి శరీరం ఆకలి దప్పులకూ, రాత్రికి నివాసం అయితే దాని నుంచి యక్ష రాక్షసులు జన్మించారు. వారు ఆకలి దప్పులకు తట్టుకోలేక బ్రహ్మనే ఆరగించడానికి సిద్ధపడ్డారు. ఈ విషయం తెలిసి బ్రహ్మ భయపడ్డాడు. “మిమ్మల్ని సృష్టించిన నన్నే హింసించాలనుకోవడం ఏ మేరకు సముచితం? ఆలోచించండి. హింస మానండి” అని చెప్పాడు.

శబ్దాల వల్ల వారికి యక్షులు, రాక్షసులు అని పేర్లు వచ్చాయి.

మర్తోవైపు బ్రహ్మ అక్కడితో ఆగలేదు. మరో శరీరంతో సత్వ గుణం కలిగిన దేవతలను సృష్టించాడు. వారికి పగలుగా మారిఆశ్రయమయ్యిన్ది. బ్రహ్మ జఘన భాగం నుంచి రాక్షసులు పుట్టారు. వారేమో అతికాముకులు. విచక్షణ కోల్పోయి బ్రహ్మను తమకు భార్యగా ఉండమని బలవంతం చేసారు. ఒత్తిడి పెంచారు. అప్పుడు బ్రహ్మ వారి నిర్బంధం నుంచి ఇవతలకు వచ్చి అపురూపమైన స్త్రీగా మారాడు. రాక్షసుల ఆనందానికి అంతులేదు. ఆమె చుట్టూ చేరి ప్రేమిస్తున్నామన్నారు. ఆమెను తమకు భార్యగా ఉండమని కోరారు.

ఇలా ఉండగా అప్పటికి తనకొచ్చిన ప్రమాదం తప్పినందుకు లోలోన సంతోషించాడు. అర చేతిని వాసన చూసాడు. ఆ క్షణంలో అప్పటికప్పుడు దాని నుంచి గంధర్వులు పుట్టారు. అప్సరసలు పుట్టారు.

ఆ తర్వాత బ్రహ్మ మరొక శరీరం ధరించాడు. దాని నుంచి పిశాచాలు, గుహ్యక, సిద్ధ, భూత గణాలు పుట్టాయి. అక్కడితో ఆగకుండా బ్రహ్మ మరొక శరీరం ధరించగా అప్పుడు దాని నుంచి పితృ, సాధ్య గణాలు పుట్టాయి. ఆకాశ సంచారులు పుట్టారు. ఈ గణాలను ఉద్దేశించి శ్రాద్ధాలు, హవ్య కావ్యాలు ఆచరించాలి అని ఆదేశించాడు. ఇంకొక శరీరంతో విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు తదితరులు పుట్టుకొచ్చారు. అప్పటికీ తన సృష్టి వృద్ధి చెందడం లేదని కాళ్ళు, చేతులు విదిలిస్తాడు. పక్క మీద నడుం వాలుస్తాడు. అప్పుడు ఆ శరీరం నుంచి జారిపడిన వెంట్రుకులు సర్పాలయ్యాయి.

అనంతరం బ్రహ్మ మనస్సు తృప్తి చెందింది. మనువులను సృజించాడు. తన పురుష రూప శరీరాన్ని ఇచ్చాడు. రుషి గణాలను సృష్టించి వారికి సమాధి, యోగం, ఐశ్వర్యం, తపస్సు, విద్య, వరక్తి అనేవి అనుగ్రహించాడు.
(సశేషం)
– యామిజాల జగదీశ్