పేటీఎం వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీం ఇండియా మహిళ జట్టు క్రికెటర్ పూజా వస్త్రాకర్ అరుదైన రికార్డును సాధించింది.
వడోదర రిలయన్స్ స్డేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో అద్దరగొట్టిన పూజా 9వ డౌన్ లేదా అంతకంటే తక్కువస్థాయిలో బ్యాటింగ్‌కి దిగి హాఫ్ సెంచరీ సాధించిన తొలి భారతీయ మహిళ క్రికెటర్‌గా రికార్డు సాధించింది. మ్యాచ్‌లో 56 బంతులు ఆడిన పూజా 7 ఫోర్లు, 1 సిక్సుతో 51 పరుగులు చేసింది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 32.1 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు మాత్రం కోల్పోయి 202 పరుగులు చేసి విజయం సాధించింది.