భువనవిజయి పంచ వర్ష కన్య

ఆంధ్రావని జన్మనిచ్చి పెంచిన బిడ్డలము మేము
ఆస్ట్రేలియా మాత యొడి జేరితిమి
అనురాగాభిమానము లకు లోటు లేదు
అందని కన్నతల్లి తీయని పలుకు తక్క .
సోకుట లేదు వీనుల అందమైన అమ్మాయను పిలుపు
తాకగ లేదు నటుల పిలిచి పిలిపించుకొ ను భాగ్యము .

మేమన్న దమ్ములము పదిమంది
సోదరి యొకతె , అందరము కలిసి
స్నేహ సౌహా ర్ద్రముల మెలగుచు
మా తల్లి భాషను నెమరు వేయుచు
నిరంతర సాహితీ వ్యవసాయము నకు ద్యుక్తుల మైతిమి ,
అన్యధా మనఃశాంతికి మార్గము లేదని ధృడ నిశ్చయు లమై .

మేజేసిన యొక మంచి పని యేమన
ఇచటకు తరలి వచ్చు నపుడు
శారద మాత ప్రతిమ నొక్కటి తెచ్చుకొని
ఆ జ్ఞానస్వరూపిణి నారాధించుచు నుంటిమి .

ఏకాగ్రత నేకలవ్య దీక్ష నవలంభించితిమి
మాలోని బాల శారద దిన దిన ప్రవర్ధ మనమగుచు
మా పున్నెముల పంట యనగ
కలకలలాడుచు ,మా వాకిట యాడుచు పాడుచు

దర్శన మిచ్చె నేడు పంచవర్ష కన్యక
శోభాయమాన ,నేత్ర పర్వమై
విజయిభువనేశ్వరి శారద భువనగ భువినవతరిన్చెన్ .