భువనవిజయ ఉత్పలమాల పద్యమాలిక

తొండమురాయుకున్తొలుత దోసిలియొగ్గుచుభక్తితోడనే
దండముచేయగామదిని దర్శనమిమ్మనివిఘ్నహారుడే
గండముతొల్గజేయనడకన్వడివచ్చెనుమాసుతుండునా
గుండెకునిండుగాముదముగూర్చెనునుత్పలమాలగైకొనెన్

మూషిక వాహనా! మదిని మ్రొక్కెద మమ్మేల రాగదే! దయా
భూషణుడా! ఉమా సుతుడ! విద్య నొసంగి మనోర్తి తీర్పుమా
ఇష్టప్రదాయకా! సుముఖ ఇంద్ర గణాధిప ప్రీతి చూపుమా
నిష్ఠ నియమితాగ్రజ! వినాయక! కష్టము బాపి బ్రోవుమా