భువన విజయ త్రయాబ్ది జన్మదిన వేడుక

సరసోల్లాస భాషణా సంభరితమై,
సుర వన విహార సంరంభ సమాన
వర కవితామ్రుతానంద పాన మత్త చిత్తయై ,
ఉరు భాషా పరిజ్ఞ్యాన సమాసక్తత పరమావధిగా
పరగినయట్టి “భువనవిజయ”సమ్మేళనమందె
భూరి సత్కారముల్ , ప్రశంసలన్,
మురిపముగ మూడు వర్షముల లేత ప్రాయంబునన్
భారతీ హృదయ విజేత ,
భావితర స్ఫూర్తిదాయక విధాత
భవ్య గుణ సుశోభిత సుజ్ఞ్యాన విజ్ఞ్యాత
ఆంధ్ర భాషామతల్లి యనుంగు సంజాత ,
“భువన విజయ “ప్రఖ్యాత నామ విదిత ,
త్రయాబ్ది జన్మదిన వేడుకన్ జేయ
నీకిదె విజయ వత్సర సుస్వాగాతంబు .