భువన విజయ పంచమ వార్షికం

దుష్ట గుణ నాశినీ! శిష్ట గుణ రక్షినీ! మహిషాసుర మర్ధినీ!
దశావతారీ! శ్రీనృసింహ మురారీ! ఆశ్రిత భయ నివారీ!

సర్వశక్తి సమన్వయీ! సర్వాధారీ! సర్వహిత కారీ! శ్రీసాయి శ్రీకరీ!
సృజనాత్మక శక్తివి నీవే! కవుల కల్పనలో నీవే! మమ్మేలే జననివి నీవే!

తలచిన కార్యముల నీడేర్పవే! కోరిన కోర్కెల సిద్ధ మొనర్పవే!
చిలుకలు పలికే స్వాగతమా! పలుకగ నేర్చిన రామమంత్రమా! సిద్ధిని పొందగ చిన్నిప్రయత్నమా!
బాల కృష్ణుని బుడత నడకయో! యశోదమ్మతల్లి గాఢ సంబరమో! గంధర్వుల వీధి గానాలాపమో!

చిన్నిపొన్ని చిరుతల చిరుచిరు పలుకులే! వన్నెలు తరుగని వింతచేష్టలే !
కాలమే తెలియని కంటివెలుగులే!
ఏది ఏమనగ ఏమి తోచెనో ! తోచ లేదనగ లేదు ఉందనో!

ఉంది లేదనగ రాదు కవితయో! కవిత వ్రాయుటకే కలము పట్టేనో!
హరిఓం హరిఓం నామోఛ్ఛరణము ! శంభో శంభో యను వేడు కొల్పులు!

వేదమంత్ర పఠన పూజార్పితములు!
శ్రీహరి పూరించిన శంఖారావo! అర్జును కొసగిన గీతొపదేశo! శాంతికాముకుల రక్షణకవచo!
సాంబశివుని మెడ బుస్సుబుస్సులు! చిన్నికృష్ణుకెంత కాళియ ధూర్తము! భక్తుల పాలిటి కల్పవృక్షము!
కవివరు మనసున ఊహలు పుట్టెడు! కవితాస్త్రాలయ కవుల వేడుకలు!

కనివిని యెరుగని కాంతుల సోనలు!
మనసున పుట్టే యలజడులు! దాటిన తెలియుగ తత్వార్ధములు! మానవ జీవిత పరమార్ధములు!

మనసున పుట్టే యలజడులు! దాటిన తెలియుగ తత్వార్ధములు! మానవ జీవిత పరమార్ధములు!
సమచిత్తంబన సమదృష్టం ! సమదృష్టింగను నాత్మభవున్! జీవన్ముక్తి కదే చరమస్థానం!

–రాంప్రకాష్ ఎర్రమిల్లి