భువన విజయ పద్య కవితాధ్యయనం

అపురూపాంధ్ర మాతృభాష తెలుగు వ్యాకరణాభివృద్ధికి రూపకల్పన చేయనున్న మెల్బో కవి శ్రేష్ఠులందరికీ నా అభినందనలు.

ఈ సమయంలో సంధర్భోచితంగా మనందరి కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తూ నాపరంగా నేనందించు వినతి….

సేతువునగమ్యంఎరుగని పడవలఅలజడులు
నేటి గరళభరిత నూతనసాహితీతీరుతెన్నులు
నవపథాన వెలిగిపోతోన్నపరభాషా దీపికలు
దీనస్థితిలోన నిలిచిపోయిన తెలుగువెలుగులు

హిందుస్తానీ అంగ్రేజీల పదప్రయోగ బోధనలు
తెలుగుసాహిత్యాన్నిపాతాళానికీడుస్తున్నాయి
నవకవుల తెలుగు సాహితీ కవన కుసుమాలు
నేటి నర్తకుల పాదకదలికల నలిగిపోతున్నాయి

అడ్డులేని పరభాషాపదచౌర్యం పదిలమవుతోంది

మన తెలుగుమార్గం కానున్నది అగమ్యగోచరం

కాన వెలిగించండి మరల తెలుగు కర దీపికలని

కదలి రండి నిలుపండి మనసాహితీ విలువల్ని

తెలుగుభాషా పోషకులారా అడ్డుకోండీ ద్రోహాన్ని

ఆలకించండి కవితాకన్నియల ఆర్తనాదాల్ని

కడలినీటి పరం కానీకండి సుకవితా ధారల్ని!

అరికట్టండీ మాతృభాషా సంహరణల పర్వాన్ని!

భవదీయుడు సాహితీవిధేయుడు