మనిషే జయిస్తాడు

లక్షల సంవత్సరాల మానవ ప్రస్థానం లో
ఎన్నెన్ని విలయాలు – ఎన్నెన్ని ప్రళయాలు
ఎన్ని సంఘర్షణలు – ఎన్ని సంక్షోభాలు
ఎన్నెన్ని యుద్ధాలు – ఎన్నెన్ని మరణాలు
ఎన్నెన్ని వికృతులు – ఎన్ని విస్మయాలు
గుండె నిబ్బరం ఉన్న మనిషే ఎదిరించాడు
మనిషే జయించాడు-

కరాళ నృత్యంచేసిన – కలరాను ఓడించిన
పీనుగుల దిబ్బలు పేర్చిన – ప్లేగును పూడ్చేసిన
స్లోపాయ్ జన్ వంటి వ్యాధి -స్వ్యెన్ ఫ్లూను తరిమేసిన
దర్జాగా విహరించిన – డెంగ్యూ మెడలు వంచిన
వ్యాధుల నిర్మూలించే వైద్యం కనిపెట్టాడు
మనిషే జయించాడు-

విశ్వమంత వ్యాపించిన వైరస్ – విధిస్తున్న శిక్ష
కంటికి కనబడని శత్రువు – కరోనా ఇప్పుడొక పరీక్ష
వ్యాధికి ఆమడ దూరం – ముందస్తు జాగ్రత్త మేలు
ఇంటి పట్టునే ఉంటూ – విజృంభణనాపవచ్చు
కాలయముడు కరోనా పై
మనిషే జయిస్తాడు
విషవాయువు వైరస్ పై
విజయం సాధిస్తాడు

-ఆచార్య ఎస్వీ సత్యనారాయణ