మహిషాసురమర్దనీ!

దుష్టుల శిఖ్షించు తరిని శక్తిదుర్గ వై
శిష్టుల రక్షించు తరిని అమ్మదుర్గ వై
లేముల బాపే తరిని కనకదుర్గ వై
అజ్ఞానము తొలగించే పరంజ్యోతి వై
మా యెద సదా నిల్చు ఆశాదీపమై
మేము నిత్యమూ కొల్చు వేల్పుదుర్గ వై
వాంఛితార్ధమ్ముల నొసగు దయానిధి వై
బహుళరీతుల మమ్ము కాచు మాత్రుదేవి వై
మేము చేబూను కార్యముల నీడేర్చు విజయదుర్గ వై
ఆశ్రితులకు అభయ మొసగె జగజ్జనని వై
మా పూజలు అందుకొనవే శుభముల కురిపింపవే
దుర్గా ! శ్రీమాతా! శాంకరీ! శ్రీకరీ! అభయంకరీ! మహిషాసురమర్దనీ!

—రాంప్రకాష్ ఎర్రమిల్లి