‘మాస్టర్‌’ జూన్‌ 22నేనా?

‘మాస్టర్‌’ వచ్చేది జూన్‌ 22నేనా?

ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్‌ నటిస్తున్న చిత్రం ‘మాస్టర్‌’. లోకేశ్‌ కనకరాజన్‌ దర్శకుడు. మాళవిక మోహనన్‌ నాయిక. విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడుగా కనిపించనున్నాడు. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని భావించింది చిత్ర బృందం. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా వేశారు. తాజాగా మరో విడుదల తేదీ కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. కొంతకాలం ఆలస్యమైనా విజయ్‌ పుట్టిన రోజు కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారట. జూన్‌ 22 విజయ్‌ పుట్టిన రోజు. అప్పటికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని ఆలోచించిన చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుందని టాక్‌. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఎక్స్‌బీ ఫిల్మ్‌ క్రియేటర్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల పాటలు సామాజిక మాధ్యమాల్లో హుషారెత్తిస్తున్నాయి.

Send a Comment

Your email address will not be published.