మెగాస్టార్‌ ‘ఆచార్య’

మెగాస్టార్‌ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఫోటోలు బయటకు రాలేదు. తాజాగా ఈరోజు చిరంజీవి పుట్టినరోజు పురష్కరించుకొని 152వ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్ని ఆవిష్కరించారు. పోస్టర్లో చిరంజీవి చేతిలో రక్తమోడుతున్న కత్తిని పట్టుకొని ఉన్నారు. ఆ కిందనే చనిపోయిన పడివున్న శవాలు. అంతేకాదు చిరుకి ముందు ధర్మస్థలి అనే రాసి ఉన్న ఓ పెద్ద ద్వారం కూడా కనిపిస్తుంది. ద్వారానికి ఇరువైపుల సాధు సంతువులతో పాటు సామాన్య జనం కూడా ఉన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో చిరంజీవి నక్సలైట్‌గా కనపించనున్నారు. దర్శకుడు కొరటాల చిత్ర పోస్టర్‌ ట్వీట్‌ చేస్తూ ‘‘..ధర్మం కోసం ఒక కామ్రేడ్‌ చేసిన అన్వేషణ’ అంటూ పేర్కొన్నారు. రామ్‌ చరణ్‌ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పాత్రపై ఎలాంటి క్లారిటీ లేదు. ‘ఖైదీ నంబర్ 150’ తరువాత కాజల్‌ మరోసారి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. కరోనా మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షల వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది. సామాజిక సందేశమే ప్రధానంశంగా వస్తోన్న చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, నాసర్‌, సాయాజీ షిండేలు కీలక పాత్రల్లో నటించనున్నారు. మణిశర్మ సంగీత స్వరాలు సమాకూర్చుస్తుండగా, తిరు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.