మేరీ కోమ్ సిరీస్...

మేరీ కోమ్ సిరీస్...

మేరీ కోమ్ …భారత దేశం నుంచి అయిదు సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకున్న మేరీ కోమ్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సొంతం చేకున్నారు. ఆమె జీవితం ఆధారంగా అనిమేషన్ సెరీస్ తయారవుతోంది. ఈ సిరీస్ కి గుంటూరుకి చెందిన విక్రం వేటూరి దర్శకత్వం వహిస్తున్నారు. గుంటూరు కి చెందిన విక్రం 1990 లో అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.

ఆయన హైదరాబాద్ లోని నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసారు. అనిమేషన్ లో ప్రత్యెక కోర్సు చేసిన విక్రం ప్రస్తుత ప్రాజెక్ట్ శరగంతో సాగుతోంది.

మణిపూరుకి చెందిన మేరీ కోమ్ బాల్యం నుంచి చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. మేరీ కోమ్ వయస్సు 32 ఏళ్ళు. తనపై చిత్రీకరించే సెరీస్ కోసం ఆమె స్క్రీన్ యంగ్ క్రియేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ తో ఒప్పందం చేసుకున్నారు. ఆమె కథనం ఎంతో ప్రేరణ అనిపించేలా ఉందని విక్రం మాట.

ఈ కాలంలో ఆత్మరక్షణ ఎంతో ముఖ్యమని, అనిమేషన్ సెరీస్ లో ఆ విషయాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దారని మేరీ కొం చెప్పారు. సహజంగా తమ పిల్లలు ఘర్షణ పడటాన్ని కన్నతల్లితండ్రులు ఇష్టపడరని, కానీ ప్రస్తుతం సమాజంలో చుట్టూ జరుగుతున్న నేరాలూ ఘోరాలూ దృష్టిలో పెట్టుకుని పెద్దలు కళ్ళు తెరిచారని, అందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.

Send a Comment

Your email address will not be published.