మైత్రీ బంధం

మధురం,మధురం,మైత్రీబంధము మధురం
మానవీయ బంధములన్నిట మిన్న
పవిత్ర మైత్రీబంధం ,
ఆత్మీయ బాంధవ్యములకన్న,
ప్రేమానురాగ వాత్సల్యములకన్న
అతి చేరువ అత్యద్భుతం,
ఆత్మీయులతో భార్యాభర్తలతో
పంచు కోజాలని ,
బాధలు, గాధలు,అంతర్వేదనలు,
బాహ్యావేసాలు,తరతమ బెధరహితమై,
పాలు పంచుకొని సేదదీరు కల్మష రహిత స్నేహం
హృదయాల శాశ్వతమై నిలచు,బంధం ॥మైత్రీబంధం॥

తలి దండ్రులు, తోబుట్టువులు, ఎవరికీ
తెలుపజాలని మనోవేదన, ఆనందొత్సాహ
నిఘూడ విషయ మేదయినా గాని
నిస్సంసయముగా చర్చించ దగు,
స్నేహబంధం మధురం, మధురం, ॥మైత్రీబంధం॥

దేశ విదేశ ప్రగతికైనా మానవ
సంఘీభావముకైన
స్వార్ధరహిత
నిష్కల్మష మైత్రీబంధం ,॥మైత్రీబంధం॥

కులమత బెధమేరుగని
స్త్రీ పురుష బేదములు లేని నిస్వార్ధ
మైత్రీ బంధం అపురూపం .
కలిమిలేముల నెంచబొదు
సమయా సమయములనక
మంఛి ,చెడులు ,దూర భారముల
చూడక అసలైన
మైత్రి కష్టసుఖాల కలిసి మెలిసి
ఆదుకొను అపురూప వరం ॥మైత్రీబంధం॥

————————————————–
కామేశ్వరి సాంబమూర్తి .భమిడి పాటి
పి. ఎ.యు. ఎస్ .ఎ