మోడీ విజయ డంకా...

మ్రోగింది, మ్రోగింది
“మోడీ “విజయ ఢంకా మ్రోగింది,
ఎగిరింది ఎగిరింది “భాజపా “కీర్తి పతాక
ఎగిసింది భారత గగనాన మెరిసింది
భారతావని భావి ఆశల పల్లకి
భాజపా భుజాల నిలచింది ,॥ మ్రోగింది, మ్రోగింది॥

“బిజెపి “నేతలు”, నూతన ప్రధాని,
“నరేంద్రమోడి “నవ్య వ్యూహాల,
జనని భారతి శాంతి సౌభాగ్యాల,
సేద దీరనుంది
అన్యాయ,అక్రమ,దుష్ట
ముష్కర ,దుశ్చర్యల,
ఆహుతులు,ఆరందనా ఆవేశాలు,
మారణ హోమ ,మదాంధ
కీచక మృగాళ్ళ దుశ్చర్యల,
దురాగతాల,మ్రగ్గి విసిగి వేసారిన తల్లి “భారతి ”
అధరాల చిరునవ్వు విరిసి
భావి “ప్రగతిపద” ఆశల
బాసల,భరోసాతో
మురిసింది ॥ ” మ్రోగింది ,మ్రోగింది ॥

“నిరుద్యోగ సమస్య ,పేదరిక నిర్మూలన,
స్త్రీజనోద్దరణ ,స్త్రీజన రక్షణ,ద్రవ్యోల్బణ కుదింపు,
ఇత్యాది ఎన్నెన్నో కఠిన సమస్యల తోరణం,
మోడిని సవాలు జేయ,
నూతన వ్యూహ రచనా విజ్ఞ్యతతో,
అతిరధ మహారధ భాజపా యోధుల గూడి
సమాలోచనాల పరిష్కరించి,
శాంతి ,సౌఖ్యాల పునరుద్ధరించగల,
నేత “మోడీ “గ ఎంచి ఎన్నుకున్న భారత ప్రజల
ఆసలు ఆశయాల నీడేర్చుధైర్య,
నిస్వార్ధ ప్రధాని “మోడీ,”॥ మ్రోగింది ,మ్రోగింది ॥
“అర్ధరాత్రి నడివీధిని ఆడది
ఒంటరిగా నడవగలిగిన నాడే
నిజమైన స్వాతంత్ర్యము”అని పలికిన
జాతిపిత గాంధి పలుకుల
సార్ధకము సేయునని
” మోడీ” పై భారతజనావళి నమ్మిక.
భరతమాత ఆశీస్సు లంది ”నరేంద్ర మోడీ”
దిగ్విజయ యాత్ర సేయు గాక..
—————————————————–
కామేశ్వరి సాంబమూర్తి .భమిడిపాటి .పి ఎ.యుఎసె ఎ