యువతకు మార్గ దర్శకం - జనరంజని

12
11
యువ కెరటాలు వెల్లువెత్తి రంగస్థలంపై చిందులేసి మెల్బోర్న్ నగరంలో తెలుగు ప్రభంజనం హోరెత్తించిన తాయి జనరంజని. ఇక్కడి యువతను ప్రోత్సహించాలన్న దృక్పథంతో ఒక యువ దర్శకుడుని అతిథిగా పిలిచి సాంకేతికంగా దినదినాభివృద్ధి చెందుతున్న సినిమా రంగంలో లఘు చిత్రాల పోటీని నిర్వహించడం ఎంతో ముదావహం.

ఈ సంవత్సరం మెల్బోర్న్ తెలుగు సంఘం కార్యవర్గంలో ఎక్కువమంది యువకులే. కార్యక్రమంలో పాల్గొన్నవారూ యువకులే. నిర్వాహకులూ యువకులే. వాచస్పతులూ యువకులే. యువతే ధ్యేయంగా నిర్వహించబడిన కార్యక్రమం “నేటి యువత – రేపటి భవిత” అన్నట్లుగా ఉంది.

13
25
14

ప్రవాస జీవితం మూలంగా తీర్చిదిద్దబడ్డ ఈ కార్యక్రమంలో ఎంతోమంది యువ కళాకారులు పాల్గొన్నారు. నడి వయస్కులు కూడా యువ కళాకారులతో పోటీ పడ్డారు.

ప్రముఖ సినీ దర్శకుడు తరుణ్ భాస్కర్ (“పెళ్లి చూపులు”) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు. విజయ దేవరకొండ నిర్మాతగా తరుణ్ భాస్కర్ కథానాయకుడుగా నిర్మించబడ్డ హాస్య చలన చిత్రం ఈ నెల ఒకటవ తేదీన విడుదలైన సందర్భంగా ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

18
6
20
లఘు చిత్రాల పోటీలో 12 మంది పాల్గొన్నారు. అయితే 8 చిత్రాలు పోటీ నిబంధనలకనుగుణంగా ఉన్నాయి. ఉత్తమ లఘు చిత్రంగా “ఆద్య” ఎన్నిక కాబడింది. ప్రియాంక నోముల, రఘురాం సూరబోయిన నాయిక, నాయక పాత్రలలో నటించిన ప్రేమ కథా చిత్రం. మరో రెండు లఘు చిత్రాలు రెండవ బహుమతిని ఎన్నిక కాబడ్డాయి.

ఈ సంవత్సరం ఇంతకూ ముందు కన్నా భిన్నంగా ఇద్దరు ప్రత్యేకంగా ఎర్ర తివాచీ (red carpet) వాచస్పతులు వచ్చే అతిథులను ఆహ్వానిస్తూ పిచ్చాపాటి మాట్లాడడం జరిగింది. క్రొత్త ఆలోచనలతో క్రొత్తదనం కల్పించినట్లైంది. చాలామంది ఈ మార్పును ఆహ్వానించి ఆదరించారు. వీరు రంగస్థల వాచస్పతులకు అదనం.

నీల్ ఆంగస్ విక్టోరియన్ పార్లమెంటు సభ్యుడు (ఫారెస్ట్ హిల్) మరియు కౌశల్యా వఘేలా పార్లమెంటు సభ్యురాలు (వెస్ట్రన్ మెట్రోపాలిటన్) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

పసందైన విందు భోజనంతో కార్యక్రమం ముగిసింది.
27
10
17

Send a Comment

Your email address will not be published.