యోధుడిగా అల్లు అర్జున్

యోధుడిగా అల్లు అర్జున్

హీరో అల్లు అర్జున్ ఓ యోధుడిలా కనిపిస్తే ఎలా ఉంటుందో అని ఆలోచనలు చేసే వారి అభిమానుల సందడికి అవధులు ఉండవు అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

అల్లు అర్జున్ ఓ ప్రధాన పాత్రలో గుణ శేఖర్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘రుద్రమ దేవి ‘. ఈ చిత్రం వచ్చే సంక్రాంతి కి విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే ఈ చిత్రంపైన టాలీవుడ్ లో రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో నటించారు.

కాకతీయుల చరిత్ర ఆధారంగా రుద్రమదేవి చిత్రం చిత్రీకరించారు. ఇందులో గోన గన్నారెడ్డి పాత్ర ఎంతో కీలకమైంది. ఆ పాత్ర కోసం మొదట్లో ఎందరినో అనుకుని చివరికి అల్లు అర్జున్ ని ఎంపిక చేసారు. ఈ సినిమాలో నటించడానికి అల్లు అర్జున్ ముప్పై రోజులు కేటాయించి అనుకున్న రీతిలో షూటింగుకి సహకరించారు కూడా. ఇందులో ఆయన ఒక యోధుడిగా కనిపించడంపై అభిమానుల్లో చర్చలు జరిగి అంచనాలు పెరిగాయి. అల్లు అర్జున్ పాత్ర కోసం గుణశేఖర్ భారీగా ఖర్చు పెట్టి తీర్చి దిద్దారు కూడా.

ఆ మధ్య ఈ చిత్రంలో నటించిన అనుష్క కు సంబంధించిన పోస్టర్లు విడుదల చేసారు. ఇప్పుడు అల్లు అర్జున్ అబిమానులకు ప్రత్యేక గిఫ్ట్ గా ఈ నెల 18 న ‘గోన గన్నారెడ్డి’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు.

ఈ చిత్రానికి సంగీతం.ఇళయరాజా.

Send a Comment

Your email address will not be published.