'రాజుగారి గది 3' రెడీ అవుతోంది

Raju Gari Gadhi-3‘రాజుగారిగది, రాజుగారి గది2’ చిత్రాల తర్వాత ఓంకార్‌ దర్శకత్వంలో ‘రాజుగారి గది3’ రాబోతోంది. అశ్విన్‌బాబు, అవికాగోర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ ముగిసింది. డబ్బింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. షబీర్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరాకు విడుదల చేస్తున్నారు. కాగా, చిత్ర ఫస్ట్‌లుక్‌ వి.వి.వినాయక్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆ రెండు చిత్రాలకంటే ‘రాజుగారి గది 3′ పెద్ద హిట్‌ కావాలి. ఓంకార్‌ కష్టపడి కమిట్‌మెంట్‌తో ఈ సినిమా చేస్తున్నారు. అశ్విన్‌ ఈ సినిమాలో తొలిసారి సోలో హీరోగా నటిస్తున్నాడు. ఓంకార్‌ ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టీవీ రంగంలో ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎంత పెద్ద బ్యానర్‌ అయ్యిందో సినిమా రంగంలోనూ అంతే పెద్ద బ్యానర్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.

దర్శక, నిర్మాత ఓంకార్‌ మాట్లాడుతూ.. ‘రాజుగారి గది’ సినిమాను చేసేటప్పుడు ఆ సినిమా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అప్పుడు వినాయక్‌ చేతుల మీదుగా వినాయక చవితిరోజునే టీజర్‌ను విడుదల చేశాం. దాని దశ మారిపోయింది. బిజినెస్‌ అయిపోయింది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆయన చేతుల మీదుగా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయడం ఆనందంగా అనిపించింది. వినూత్నమైన అంశంతో థ్రిల్‌ కల్గించేవిధంగా చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.

Send a Comment

Your email address will not be published.