'రావణాసుర"గా రవితేజ

'రావణాసుర"గా రవితేజ

చిన్న చిన్న పాత్రలు చేస్తూ అంచలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజాగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు రవితేజ. ప్రస్తుతం రానున్న ఖిలాడీ, రామారావు ఆన్‌ డ్యూటీ తర్వాత రవితేజ 70వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా రావణాసుర. ఈ సినిమాకు సుధీర్‌ వర్మ దర్వకత్వం వహిస్తున్నారు. అయితే ఇంతటి పవర్‌ఫుల్‌ టైటిల్‌ పెట్టడంతో ప్రేక్షకులు, అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

అందుకు తగినట‍్లే మూవీ క్యాస్టింగ్‌ను ఎంపిక చేసే పనిలో పడింది చిత్ర యూనిట్‌. ఈ సినిమాలో రవితేజ కోసం ఒక శక్తిమంతవమైన లేడీ విలన్‌ రోల్‌ను తీర్చిదిద్దనున్నారట. ఈ పాత్ర కోసం హుషారు, జాంబీరెడ్డి ఫేమ్‌ దక్షా నాగర్కర్‌ను సెలెక్ట్‌ చేసినట్లు సమాచారం. ఈ పాత్రకు దక్షా కూడా ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతోంది. జాంబీ రెడ్డి, హుషారు, హోరాహోరీ చిత్రాల్లో ఆకట్టుకున్న దక్షా ఈ సినిమాలో లాయర్‌గా సందడి చేయనున్న రవితేజను ఎలా ఢీకొట్టనుందో అని అభిమానుల్లో ఆసక్తిరేకెత్తిస్తోంది.. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ‘రావణాసుర’ చిత్రం జనవరి 14న పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.