రేడియో జాకీ నుంచి...

రేడియో జాకీ నుంచి సినిమా హీరోగా ఎదిగిన నాని

తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటిసినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకొని తన సహజమైన నటనతో ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో తన న్యాచురల్ నటనతో టాలీవుడ్ లో న్యాచురల్ స్టార్ గా పేరు తెరుచుకున్నాడు. మరి ఆ హీరో ఇప్పటికే ఎవరో స్ట్రైక్ అయ్యే ఉంటుంది కదా. ఇంకెవరు మన పక్కింటి అబ్బాయిలా అనిపించే నాని. మరి నాని సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఏం చేసేవాడో మీకు తెలుసా.

నిజానికి సినీపరిశ్రమకు రాకముందు రేడియో జాకీగా కెరీర్ మొదలుపెట్టాడు నాని. వరల్డ్ స్పేస్ శాటిలైట్‌ అనే రేడియో స్టేషన్‌లో రేడియో జాకీగా పనిచేసేవాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మారారు. అది కూడా అలాంటి, ఇలాంటి డైరెక్టర్ దగ్గర కాదు.. బాపు లాంటి లెజెండరీ డైరెక్టర్ దగ్గర బాపు గారి వద్ద. బాపు దగ్గర ‘రాధాగోపాలం’ సినిమాకు గాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ తర్వాత శ్రీను వైట్ల దగ్గర ‘డీ’ చిత్రానికి గాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు.

ఓ యాడ్‌లో నానిని చూసిన ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి.. తాను తెరకెక్కిస్తున్న ‘అష్టా చెమ్మా’ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. నాని కెరీర్‌కు పునాది వేసింది ఈ సినిమానే. బాక్సాఫీస్ వద్ద బాగా ఆడింది. నానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించేసుకున్నారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూపోయారు. కెరీర్ మొదట్లో కాస్త ఫ్లాపులు వచ్చినప్పటికీ నాని సినిమా అంటే మాత్రం ఇప్పుడు మినిమం గ్యారెంటీ.

ప్రస్తుతం నాని ఇంద్రగంటి దర్శకత్వంలో నటించిన ‘వి’ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సెప్టెంబ‌ర్ 5న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల చేయనున్నారు. సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలో నివేదా థామస్, అదితి రావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్సు బ్యానర్ పై శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించగా…థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

ఇక ఈ సినిమాతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా “టక్ జగదీష్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్సు పైకి వెళ్లనుంది. టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌ కలిసి ‘శ్యామ్ సింగరాయ్‌’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్సు పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరి ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్న రేడియో జాకీ నుండి ఇంత స్థాయి వరకూ ఎదిగాడంటే మాములు విషయం కాదు. ఇలానే నాని తన సహజ నటనతో ఎన్నో సినిమాలు చేయాలని.. ఎన్నో సూపర్ హిట్లు అందుకోవాలని కోరుకుందాం.

Send a Comment

Your email address will not be published.