వాక్కు నిచ్చిన తల్లి

యతులు ప్రాస తోడి యానమ్ము తెలుగన్న
సంధి ఛంద బంధ సంద్రమన్న
తెలుగు భాష ఘనత పలుకంగ రారన్న
“తెలుగు తల్లి జయము” పలుకు మన్న

వందనములు తెలుగు వాక్కు నిచ్చిన తల్లి
పద్య కావ్య కవన పాల వెల్లి
సౌరభాలు జల్లు సన్నజాజులు,మల్లి
కవి హృదయ వినోద కల్పవల్లి

భువన విజయ కావ్య పూరిత శంఖమ్ము
వలస నంద లమ్ము వాసి తమ్ము
తెనుగు ప్రేమికులకు తేనె పాయసమ్ము
వ్యాకరణ సుఛంద మకుటితమ్ము

సాహితీ సుగంధ సహితచారిత్రము
సేతు, శీతనగము ప్రీతికరము
లోకభాషది కడు లోతైనది వినుము
ప్రణతు లిడుము తెలుగు ఘనత గనుము
……….. సూర్యనారాయణ సరిపల్లె