వినోదాత్మక చిత్రం “అమీ తుమీ”

వినోదాత్మక చిత్రం “అమీ తుమీ”

ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “అమీ తుమీ” పూర్తి వినోదాత్మక చిత్రం.
అడివి శేష్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ అవసరాల, ఈషా రెబ్బ, అదితి మ్యాకల్
తదితరులు నటించిన ఈ చిత్రాన్ని నరసింహారావు నిర్మించగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ.
కథలోకి వెళ్తే …

తనికెళ్ళ కోటీశ్వరుడి పాత్రలో నటించారు. ఆయన కొడుకుగా విజయ్ పాత్రలో నటించారు శ్రీనివాస్ అవసరాల.
విజయ్ మాయ పాత్రలో నటించిన అదితి మ్యాకల్ ను ప్రేమిస్తాడు.
అయితే చాలా కథలలోగానే మాయ తండ్రితో ఉన్న కొన్ని స్పర్థలతో భరణి వీరి పెళ్ళికి ససేమిరా అంటారు.
సరిగ్గా అదే సమయంలో భరణి కూతురు దీపిక అనంత్ అనే యువకుడిని ప్రేమిస్తుంది. దీపిక పాత్రలో ఈశా రెబ్బ నటించగా అనంత్ పాత్రలో అడివి శేష్ నటించాడు. కానీ తన కూతురు డబ్బు లేని వాడిని ప్రేమించిన కారణంగా భరణి కూతురు పెళ్ళికి కూడా ఒప్పుకోడు. అంతేకాదు, కూతురికి శ్రీ చిలిపి అనే అతనితో పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు. శ్రీ చిలిపి పాత్రలో వెన్నెల కిశోర్ నటించాడు.

కానీ ప్రేమలో మునిగి తేలుతున్న ఈ రెండు జంటలూ తమ పెద్దల్ని కాదని ఏకమైపోవాలని తహతహలాడుతాయి. ఈ క్రమంలో వాళ్ళ ఆశలు నేరవేరేయా లేదా తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాలి.

ఈ చిత్రానికి వెన్నెల కిషోర్ నటన కొండంత సొత్తు. అతని నటన అన్ని విధాలా సరిపోయింది శ్రీచిలిపి పాత్రకు. అతని డైలాగు డెలివరీ అద్భుతం. ఇక పనిమనిషి పాత్రలో నటించిన శ్యామల దేవి కూడా చక్కగా నటించింది. ఆమె పోషించిన పాత్ర పేరు కుమారి.

అలాగని కథానాయిక పాత్రలో నటించిన ఈషా రెబ్బను విస్మరించడానికి వీల్లేదు. ఆమె తెలంగాణ యాసలో చక్కగా మాట్లాడి ప్రేక్షకుల హర్షధ్వానాలు అందుకుంది.

మోహన్ కృష్ణ ఇంద్రగంటి తేలికైన కథతోనే చిత్రాన్ని నడిపించి ఆహా అనిపించుకోవడంలో విజయవంతమయ్యారు. ఆయన స్క్రీన్ ప్లే బాగుంది.

శ్రీనివాస్ అవసరాల పాత్ర పెద్దగా లేకపోవడం ప్రేక్షకులకు నిరాశ తప్పదు.
ఇదొక లో బడ్జెట్ చిత్రమే అయినా నిర్మాణ విలువలో ఎక్కడా ఏ లోపం దొర్లకుండా జాగర్తలు తీసుకున్నారు నిర్మాత నరసింహారావు.

సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన స్వరాలూ బాగున్నాయి.
మొత్తం మీద సకుటుంబంగా చూడదగ్గ చిత్రమే “అమీ తుమీ”

Send a Comment

Your email address will not be published.