శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరో ఆరు వందల ఎకరాల్లో విస్తరించబోతున్నారు. విమానాశ్రయంలో రెండో రన్వే ను ఏర్పాటు చేయడంతో పాటు, ఈ విమానాశ్రయాన్ని ఒక ఎయిర్ పోర్ట్ సిటీగా నిర్మించాలని కేంద్రప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ సంగతి తెలియజేస్తూ, శంషాబాద్ విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిందని, దానికి తగ్గట్టుగా టెర్మినల్ ను విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విమానాశ్రయం వరకూ మెట్రో రైల్ వ్యవస్థను పొడిగించడం జరుగుతుందని కూడా ఆయన ప్రకటించారు. ఎయిర్ పోర్ట్ సిటీ లో పన్నెండు వేళా మంది వరకూ పెట్టె కన్వెన్షన్, ఎక్సిబిషన్ సెంటర్స్ ను కూడా నిర్మించడం జరుగుతుందని ఆయన తెలిపారు. వచ్చే నెలలో దీని శంకుస్థాపన జరుగుతుంది. ఐదేళ్లలో దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.