వెండితెరపై దిల్ రాజ్...?

వెండితెరపై దిల్ రాజ్...?

డిస్ట్రిబ్యూటర్ గా సినీ జగత్తులో అడుగుపెట్టిన దిల్ రాజ్ మొదటిసారిగా పెళ్లి పందిరి అనే సినిమాకు పంపిణీదారుగా వ్యవహరించారు.

ఆ తర్వాత 2003 లో “దిల్” అనే సినిమా తీసి నిర్మాతగా మారారు.

మరి కొన్ని సమయాల్లో ఏదైనా సినిమా విడుదల విషయంలో చిక్కుల్లో పడ్డప్పుడు ఆయన జోక్యం చేసుకుని సమస్యను తనదైన శైలిలో పరిష్కరించి ఆదుకున్న సందర్భాలునాయి కూడా.

ఇలా ఇన్ని రకాలుగా సినీ పరిశ్రమలో తనకంటూ కీలక పాత్రలు పోషిస్తూ ఓ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న దిల్ రాజ్ ఇప్పుడు కెమెరా ముందు కనిపించబోతున్నారు  అనే వార్తలు షికార్లు చేస్తున్నాయి.

అంజలి కథానాయికగా నటిస్తున్న గీతాంజలి చిత్రంలో దిల్ రాజ్ ను చూడవచ్చని  ఆనోటా ఈనోటా వినవస్తోంది.

అయితే ఇదే విషయాన్ని ఒక పత్రికా విలేకరి అడగ్గా “మీరు విన్న మాట నిజం కాదు. నేనేమీ గీతాంజలిలో కనిపించను” అని షికార్లు చేస్తున్న వార్తను అలాగే గాలిలో చక్కర్లు కొట్టిస్తున్నారు దిల్ రాజ్.

నిజాం, వైజాగ్ లలో గీతాంజలి చిత్రాన్ని దిల్ రాజ్ పంపిణీ చేస్తున్నారు.

ఇదొక హర్రర్ కామెడీ చిత్రం. రాజ కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

బ్రహ్మానందం, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, రావు రమేష్, సప్తగిరి  తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Send a Comment

Your email address will not be published.