వెండితెర స్వీటీ

వెండితెర స్వీటీ అనుష్క
– నవంబర్ 7 అనుష్క శెట్టి పుట్టినరోజు

anushka-shetty

సినీ పరిశ్రమలో కథానాయకులను ఆదరించే కాలం కన్నా కథానాయికలను ఆదరించే సమయం చాలా తక్కువ. ఏ సినిమా నటి అయినా పదేళ్ళ పాటు హీరోయిన్ గా ఉండడం అనేది ఎంతో ప్రతిభ ఉంటే తప్పా సాధ్యం కాదు. హీరోల విషయానికొస్తే వయసు దాటిన తాతయ్యలు కూడా మునిమనవరాల వయసున్న హీరోయిన్లతో కథానాయకులుగా నటించేస్తుంటారు. పురుషాధిక్యత నిండిన సినీ పరిశ్రమలో గత పదమూడేళ్ళుగా తన ప్రతిభతో అగ్రశ్రేణి కథానాయికగా రాణిస్తున్న అనుష్క పుట్టిన రోజు ఈనెల 7వ తేదీ. జన్మ స్థలం మంగుళూరు. అనుష్క శెట్టి తెలుగు, తమిళ సినిమా నటీమణిగా గుర్తింపు పొందింది. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. సినీ పరిశ్రమలో 2005లో అడుగు పెట్టేనాటికి ఆమె బెంగుళూరు నగరంలో యోగా శిక్షకురాలుగా ఉంది.

Baahubali1981లో పుట్టిన అనుష్క పాఠశాల కళాశాల విద్య అంతా బెంగుళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తుళు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు. బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాలనుండి బి.సి.ఏ పట్టా పొందింది. అయితే కంప్యూటర్ రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదని, ఫిట్‌నెస్ రంగంలో పనిచెయ్యాలని ఈమె అభిలాష. ఈమె యోగా శిక్షణ కూడా ఇస్తుంది. ఈమె గురువు భూమికా చావ్లాను పెళ్ళి చేసుకున్న ప్రఖ్యాత యోగా నిపుణుడు భరత్ ఠాకూర్. సినీ నటుడు నాగార్జున ఈమెను సినీరంగానికి పరిచయం చేశాడు.

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది. తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన bhaagamathieఅరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి మరియు జేజమ్మ పాత్రలను పోషించింది. 13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అందులో 10 కోట్లు తమిళనాడు నుండే వసూలయ్యాయి. ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. సినిమాలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. అనుష్క మొదటి సినిమాతొనె తనలోని నటిని ఆవిష్కరింఛింది. ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ‘బాహుబలి 1, 2 ‘ సినిమాల్లో అనుష్క తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించింది. రుద్రమదేవిలో అనుష్క నటన అన్ని వర్గాలవారి ప్రశంసలందుకుంది.

ఆమె సినీ జీవితాన్ని పరిశీలిస్తే
2005లో సూపర్, మహానంది, 2006లో విక్రమార్కుడు, అస్త్రం, 2006లో రెండు జ్యోతి (తమిళం) ,2006లోస్టాలిన్ ,2007లో లక్ష్యం , డాన్ 2008లో ఒక్క మగాడు, స్వాగతం ,బలాదూర్ , శౌర్యం, చింతకాయలరవి, కింగ్ , 2009 అరుంధతి , (ఫిలింఫేర్ తెలుగు ఉత్తమ నటి బహుమతికి ఎంపిక, నంది అవార్ద్ స్పెషల్ జ్యూరీ బహుమతి లభించాయి. సైజ్ జీరో, వర్ణ వంటి సినిమాల ద్వారా ప్రత్యేక ప్రయోగాలు చేయగల హీరోయిన్ గా అనుష్క నిరూపించుకుంది. అనుష్క నటించిన సినిమా అంటే దక్షిణ భారత దేశంలో ప్రేక్షకాదరణకు కొదవులేదన్న స్థాయికి ఆమె చేరుకుంది. ఈ సందర్భంగా తెలుగుమల్లి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది.

Send a Comment

Your email address will not be published.