వెన్నెల వాకిలిలో వాలాను

అందంగా ఉన్నావంటే చాలు అమ్మాయి పడిపోతుంది
అవసరం లేకున్నా సరే కురులు సర్దుకుంటుంది
తెలివైన వాడివి అనగానే అబ్బాయి పడిపోతాడు
ఆడవారి మాటలకు అర్థాలే వేరని తెలుసుకోడు

ఆమె పెదవులపై వాలి గాలి పాటయ్యింది
ఆ పాట వింటుంటే ఆమే నా ప్రాణమయ్యింది
పల్లవి చరణం మధ్య వచ్చే సంగీతంలో కలసిపోయింది
ఆమెను చూసి ముచ్చటేసే నేనూ రాగాలు నేర్చుకుంది

వృధ్ధాశ్రమంలోని ప్రాచీన భాషకు పాశ్చాత్యం పరిచయం చేశాను
యాబై ఆరు అక్షరాలకు ఇరవై ఆరు జోడించాను
గుండెలకు హత్తుకునే అక్షరాలు రాశి పోశాను
పంచవన్నెల ప్రేమవాక్యాలు అల్లి కూర్చాను

సంకేత భాషలో సందేశాలు సైతం కుదించాను
కలం నిండా రంగు రంగుల సిరాను నింపాను
వెన్నెల రాత్రుల్లో విరజిమ్మే పూల పరిమళం తాను
అందుకే సీతాకోక చిలుక రెక్కలపై రాసి పంపాను

వెన్నెల రహస్యం వెన్నెలకు చెప్పాను
చీకటి రహస్యం చీకటికి చెప్పాను
పూల గాలిలో తేలే ఆమె నవ్వులో కుప్ప కూలాను
చీకటి చివరంచు వదిలి వెన్నెల వాకిలిలో వాలాను